షాక్: pm cares నకిలీ వెంటిలేటర్లు -వాటితో మరణాలు సంభవిస్తే కేంద్రానిదే బాధ్యత: బాంబే హైకోర్టు
దేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా రోగుల ట్రేసింగ్ నుంచి ట్రీట్మెంట్ దాకా, వెల్ఫేర్ నుంచి వ్యాక్సినేషన్ దాకా అన్నింటా కేంద్రంలోని మోదీ సర్కార్ దారుణంగా విఫలమైనందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను అన్ని స్థాయిల కోర్టులు ఎత్తిచూపుతున్నాయి. అటు సుప్రీంకోర్టులో కరోనా సంబంధిత పిటిషన్లపై సుమోటో విచారణ జరుగుతుండగా, దేశం నలుమూలల్లోని హైకోర్టుల్లోనూ కొవిడ్ సంబధిత అంశాలపై కీలక విచారణలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రధాని మోదీ అట్టహాసంగా నిర్వహిస్తోన్న 'పీఎం కేర్స్' నిధులు, వాటితో కోనుగోలు చేసిన పరికరాలపై బాంబే హైకోర్టు షాకింగ్ కామెంట్లు చేసింది..

మరణాలకే కేంద్రానిదే బాధ్యత
పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల కారణంగా కొవిడ్ పేషెంట్లు మరణిస్తే దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. పీఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్లు దాదాపు నకిలీవీగా తేలడం, తరచూ పాడవుతున్నాయని జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రి అంచనాకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.

వెంటిలేటర్లతో ఆటలా?
పీఎం కేర్స్ వెంటిలేటర్ల వల్ల సంభవించే మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలన్న కోర్టు.. ఇప్పటికే పలు మార్లు ఆ యంత్రాలను రిపేర్ చేయాల్సి వచ్చిందని, అయినా కూడా అవి బాగుకాలేదని, వెంటిలేటర్లతో ఇలా ప్రయోగాలు చేయడాన్ని అనుమతించలేమని, వల్ల పేషెంట్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని జస్టిస్ రవీందర్ ఘుజె, జస్టిస్ బీయూ దెబాద్వార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా,
Recommended Video

పీఎం కేర్స్ వెంటిలేటర్లపై కమిటీ
ముంబైలోని పలు ఆస్పత్రుల్లో పాడైపోయిన పీఎం కేర్స్ వెంటిలేటర్లను పరిశీలించేందుకు వైద్యుల బృందాన్ని నియమించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. పీఎం కేర్స్ నిధులతో వెంటిలేటర్లు కొనుగులోలు చేసిన వ్యవహారం, వాటి నాణ్యతపై పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముంబై ఉదంతంలో.. పీఎం కేర్స్ ద్వారా జీఎమ్‌సీహెచ్ ఆస్పత్రికి చేరిన 150 వెంటిలేటర్లను రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతి సీఎన్‌సీ అనే సంస్థ తయారు చేసింది. అది బీజేపీ నేతల సిస్టర్ కంపెనీ అనే ఆరోపణలున్నాయి. వెంటిలేటర్లు దాదాపు నకిలీవేనని, తరచూ పాడవుతూ రోగుల పాలిట మృత్యు యంత్రాల్లా మారాయని కాంగ్రెస్, ఇతర విపక్షాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications