వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమిలో కూరుకుపోతున్న ఇళ్లు: ‘జోషీమఠ్’పై కేంద్రం కీలక భేటీ, ప్రణాళిక రెడీ

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషీమఠ్‌లో వందలాది భవనాలు పగుళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి కేంద్ర ఏజెన్సీలు సహాయం చేస్తున్నాయని, రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
జోషీమఠ్‌లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన తర్వాత పీఎంవో వర్గాలు మీడియాకు తెలిపాయి.

ఇళ్లు కుంగిపోవడానికి అదే కారణమా?

ఇళ్లు కుంగిపోవడానికి అదే కారణమా?

ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి నిపుణులు స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని అధికారులు తెలిపారు.
జోషిమఠ్, చుట్టుపక్కల జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు భూమి క్షీణతకు దారితీస్తాయని - నేల ఉపరితలం మునిగిపోవడానికి లేదా స్థిరపడటానికి దారితీస్తుందని కొన్నేళ్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రమాదకర పట్టణాల కోసం ప్రణాళికలు రెడీ చేయాలంటూ పీఎంవో


నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎప్) బృందం, రాష్ట్ర విపత్తు దళానికి చెందిన నాలుగు బృందాలు జోషిమఠ్‌‌లో ఉన్నాయి. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది.
"స్పష్టమైన కాలపరిమితితో కూడిన పునర్నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలి. నిరంతర భూకంప పర్యవేక్షణ చేయాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, జోషిమఠ్ కోసం ప్రమాదకర పట్టణ అభివృద్ధి ప్రణాళికను కూడా అభివృద్ధి చేయాలి' అని పీఎవో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

రంగంలోకి సహాయక బృందాలు

రంగంలోకి సహాయక బృందాలు


సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ లేదా ఎన్‌డిఎంఎ సభ్యులు సోమవారం రాష్ట్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం సమీక్ష సమావేశం తర్వాత వర్గాలు తెలిపాయి. ఈ రోజు బాధిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, అధికారులతో సమావేశం నిర్వహించి, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి నిబంధనలను సడలించాలని కోరారు. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా జోషిమఠ్‌ను అధ్యయనం చేసి, ఛాయాచిత్రాలతో కూడిన వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది.

పలు నిర్మాణాలతోపాటు భూకంప జోన్లోనే జోషీమఠ్

పలు నిర్మాణాలతోపాటు భూకంప జోన్లోనే జోషీమఠ్


వాతావరణ మార్పులు, నిరంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. వివిధ సహజ కారకాలు, మానవ కార్యకలాపాలు రెండింటికి సంబంధించినవి.. క్షీణతకు దారితీశాయని నిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని చమోలి జిల్లాలో జోషిమఠ్, చుట్టుపక్కల ఉన్న అన్ని నిర్మాణ కార్యకలాపాలు, చార్ధామ్ ఆల్-వెదర్ రోడ్ (హెలాంగ్-మార్వారీ బైపాస్), ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ వంటి మెగా ప్రాజెక్టులు నివాసితుల డిమాండ్‌పై నిలిపివేశారు. జోషిమఠ్ దేశంలోని అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఉండటం గమనార్హం.

English summary
Centre's Key Meet On Plans To Save 'Sinking' Uttarakhand's joshimath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X