వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావాలనే టార్గెట్: మోడీపై సల్మాన్ భార్య తీవ్ర ఆరోపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రం కావాలనే సెలెక్టివ్‌గా తన ఎన్జీవోను టార్గెట్ చేసిందని బుధవారం ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోందన్నారు.

లూయీస్ ఖుర్షీద్‌కు చెందిన ఓ ఎన్జీవోపై కేసు నమోదు చేసి, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె మండిపడ్డారు. అయితే, సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నానని చెప్పారు. తన ఎన్జీవో ఉన్న స్థలం చట్ట ప్రకారమే ఉందని, అవసరమైతే కోర్టుకు వెళ్తానని చెప్పారు.

Centre 'Selectively Targeting' My NGO, Alleges Salman Khurshid's Wife

అయితే, బ్లాక్ లిస్టులో ఉన్న మిగతా 93 ఎన్జీవోలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో 5, ప్రధాని ఇటీవల దత్తత తీసుకున్న ఉత్తరప్రదేశ్‌లో 33 ఎన్జీవోలు బ్లాక్ లిస్టులో ఉన్నాయన్నారు.

English summary
Louise Khurshid, wife of Congress leader Salman Khurshid accused the Narendra Modi government of "political vendetta", a day after the Union Social Justice Ministry referred a case against her NGO to the Law Ministry for a CBI probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X