ఆధార్ నెంబర్‌కు మొబైల్ సిమ్‌తో లింక్: ఆర్ఎస్ శర్మ
న్యూఢిల్లీ: ఆధార్ నెంబర్‌కు మొబైల్ సిమ్‌ను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆర్ఎస్ శర్మ సోమవారం ఢిల్లీలో తెలిపారు. ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ "యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌కు మొబైల్ సిమ్‌ను అనుసంధానం చేయమని ప్రధానమంత్రి (నరేంద్రమోడీ) మాకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాం. కచ్చితంగా మేమీ సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంది" అని అన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు.

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుందని అన్నారు. దీంతో భారత్‌లో డిజిటల్ రివల్యూషన్ రానుందని శర్మ పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల లావాదేవీల సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
అదే గనుక జరిగితే భారతదేశ ప్రజల సాధికారత సాధనకు ఇది ఓ పరికరంగా ఉంటుందన్నారు. ఇందు కోసం దక్షణి కొరియాలోని ఇండస్ట్రీ ప్రతినిధులను కలవనున్నట్లు తెలిపారు. ఎల్‌జీ, శ్యాంసంగ్ మొబైల్ ప్రతినిధులతో ఈ విషయంపై చర్చించామన్నారు.












Click it and Unblock the Notifications