చమురు ధరల తగ్గింపుకు కేంద్రం మరో నిర్ణయం-త్వరలో ఐదు మిలియన్ బ్యారెళ్ల నిల్వల రిలీజ్

దేశవ్యాప్తంగా చమురు ధరలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. కొంతకాలంగా స్ధిరంగా పెరుగుతూ వచ్చిన ధరలు లీటరు పెట్రోల్, డీజిల్ ను వంద రూపాయలు దాటించేశాయి. కేంద్రం తాజాగా ప్రజాగ్రహంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని సూచించింది. కానీ ఇంకా చాలా రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించకపోవడంతో చమురు ధరలు మండుతున్నాయి. దీంతో కేంద్రంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

భారత్ లో చమురు ధరల మంట నేపథ్యంలో అమెరికా, జపాన్, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో కలిసి ధరలను తగ్గించడానికి కేంద్రం తన అత్యవసర నిల్వ నుండి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయాలని భావిస్తోంది.

centre to release 5 million barrels of crude oil from strategic reserves to cool down prices

భారతదేశం తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో భూగర్భ గుహలలో అత్యవసర పరిస్ధితుల్లో వాడకం కోసం సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తోంది. ఇందులో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను 7-10 రోజులలోపు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇలా విడుదల చేసే క్రూడాయిల్ రిజర్వులను మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (HPCL) లకు విక్రయించనున్నారు. ఈ రెండు సంస్ధలు పైప్‌లైన్ ద్వారా వ్యూహాత్మక నిల్వలకు అనుసంధానించి ఉన్నాయి. ఇలా అత్యవసర నిల్వల్ని మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా చమురు ధరల తగ్గుదల సాధ్యమవుతుందని కేంద్రం చెబుతోంది. చమురు నిల్వల్ని మార్కెట్లోకి పంపడం ద్వారా చమురు లభ్యత పెరిగి ధరలు అదుపులోకి వచ్చేందుకు వీలు కలగనుంది.

ప్రస్తుతం యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పడం లేదు. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో చమురు ధరల పెరుగుదలను విపక్షాలు ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి. దీంతో ప్రజాగ్రహం బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల తగ్గింపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+