వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో కోవిడ్ ప్రమాద ఘంటికలు-10శాతం పైగా పాజిటివిటీ -కేంద్రం వార్నింగ్

|
Google Oneindia TeluguNews

దేశంలోని పలు రాష్ట్రాల్లో మరోసారి కోవిడ్ ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.అలాగే కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా ఎక్కువవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇవాళ హెచ్చరికలు జారీచేసింది.

దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఆరోగ్య కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ రాష్ట్రాల్లో వారానికోసారి గణించే పాజిటివిటీ రేటు 10 శాతం మించిపోయింది. దీంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తూ ఈ లేఖ రాసింది. ఇందులో ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యల్ని ప్రస్తావించింది.

centre warns those 7 states amid rise in covid cases, above 10 percent positivity rate

కోవిడ్ బారిన పడుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్లు వేసే వేగాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని కోరింది. కోవిడ్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని కూడా భూషణ్ ఇందులో సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలో రాబోయే నెలల్లో వివిధ ఉత్సవాల కోసం సామూహిక సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇది వైరస్ వ్యాప్తిని పెంచుతుందని, ఇది కేసుల తీవ్రతకు, మరణాల పెరుగుదలకు దారితీస్తుందని పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 19,406 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే 49 మరణాలు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతం ఉండగా.. జాతీయ రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్ కోవిడ్-19 కేసులని చూస్తే 24 గంటల్లో 571 కేసులు తగ్గాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైందని, వారాంతపు పాజిటివిటీ రేటు 4.63 శాతంగా నమోదైందని తెలిపింది. రికవరీల సంఖ్య 4,34,65,552కి చేరుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. మృతుల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు, ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఇద్దరు, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

English summary
the union govt has issued advisory to 7 states in which covid 19 positivity rate crosses 10 percent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X