తల్లి చీరతో ఉరివేసుకున్న హిమేష్ రేష్మియా మ్యాజిక్ కంపెనీ సీఈవో
ముంబై: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు హిమేష్ రేషమియాకి చెందిన మ్యూజిక్ కంపెనీ సీఈవో ఆండీ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి ఒషివారలోని తన ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆయన.. తల్లి చీర తీసుకుని ఉరి వేసుకున్నారు.
కాగా, ఆ సమయంలో ఆయన తల్లి, ప్రియురాలు ఇంట్లోనే ఉన్నారు. కుర్చీ కిందపడ్డ శబ్దం విన్న ఆయన తల్లి, ప్రియురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు తెలిపారు.

గత ఆరేళ్లుగా ఆండీ సింగ్ హిమేశ్ రేషమియా కంపెనీలోనే పనిచేస్తున్నారు. అయితే, ఆయన ఆత్మహత్యకు ఎలాంటి కారణం తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications