చీకట్లో సిజేరియన్.. వికటించిన వైద్యం.. తల్లిబిడ్డ మృతి..
వైద్యులంటే దైవంతో సమానం.. ఎందుకంటే ప్రాణాలు పోసేది వారే కాబట్టి. అలాంటిది వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ రోగుల పరిస్థితి ఏమమౌతుంది. అలాంటి సంఘటనే ఇప్పడు ఒకటి దేశ ఆర్థిక రాజధానిలో చోటుచేసుకుంది. తొమ్మిదినెలల నిండు గర్భిణీ పురిటినొప్పిలతో ఆసుపత్రికి చేరింది. అయితే, ఆమెకు చీకట్లో సిజేరియన్ చేశారు వైద్యులు. దీంతో వైద్యం వికటించి ఆ తల్లి బిడ్డ ఇద్దరూ కన్నూమూశారు. ఈ విషాధ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం...ఖుస్రుద్దీన్ అన్సారీ అనే ఓ దివ్యాంగుడు తన భార్య షాహిదున్‌కి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుష్మా స్వరాజ్ మెటర్నిటీ హోమ్‌కు తరలించారు. ఉదయం 7 గంటల సమయంలో షాహిదున్ ఆసుపత్రికి చేరుకుంటే, రాత్రి 8 గంటల వరకూ నార్మల్ డెలీవరీ అయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు వైద్యులు.

అనంతరం అపరేషన్ చేసి బిడ్డను తియాలని షాహిదున్ కుటుంబసభ్యులతో సంతకాలు తీసుకున్నారు. అయితే, అప్పటికే ఆ ఆసుపత్రిలో కరెంటు లేదు. జనరేటర్ ఆన్ చేయకుండానే, మొబైల్ ఫోన్ టార్చ్ లైట్‌తో ఆ మహిళకు సిజేరియన్ చేశారు. ఆ వైద్యం వికటించి ఆపరేషన్ థియేటర్‌లోని ఆ తల్లీ బిడ్డ కన్నుమూశారు. దీంతో ఆసుపత్రి పాంగ్రణమంతా ఆ కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఆసుపత్రి ఎదుట మిన్నంటిన రోదనలు..
వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ దిగివచ్చి ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై విచారణకు ఆదేశించింది.
నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలు పోవడానికి బాద్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరాడు. తనకు న్యాయం చేయాలని, భార్య, బిడ్డ మృతికి కారణమైన ఆసుపత్రిని మూసివేయాలని ఆన్సారీ డిమాండ్ చేశాడు.












Click it and Unblock the Notifications