చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైకి గవర్నర్: సీఎంగా శశికళకు చాన్స్ ఇస్తారా ? లేదా ?

|
Google Oneindia TeluguNews

ముంబై/చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు సేకరించడానికి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. మంగళవారం సాయంత్రం ఆయన చెన్నై చేరుకుంటున్నారని తెలిసింది.

<strong>పన్నీర్ సెల్వం రాజకీయ సన్యాసం ! బుజ్జగించే పనిలో శశికళ అండ్ కో</strong>పన్నీర్ సెల్వం రాజకీయ సన్యాసం ! బుజ్జగించే పనిలో శశికళ అండ్ కో

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సోమవారం సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయారు.

CH. Vidyasagar Rao, will arrive Chennai on Tuesday evening or Wednesday morning

విద్యాసాగర్ రావు చెన్నై చేరుకున్న వెంటనే ఆయన్ను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అనుమతి తీసుకోవాలని శశికళ నిర్ణయించారు. మొదట మంగళవారం ఉదయం 8.45 గంటల సమయంలో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్నాట్లు చేశారు.

<strong>మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం</strong>మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం

అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై వెళ్లకుండా ముంబై చేరుకోవడంతో శశికళ ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు తొమ్మిదో తేదీన శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రం విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోకపోయినా బుధవారం ఉదయం కచ్చితంగా ఆయన చెన్నై చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం.

శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు అనుమతి ఇస్తారా ? లేదా ? న్యాయనిపుణుల నుంచి ఆయన ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకున్నారు ? అంటూ అన్నాడీఎంకే నాయకులు టెన్షన్ పడిపోతున్నారు.

English summary
Tamilnadu Governor CH. Vidyasagar Rao, will arrive Chennai on Tuesday evening or Wednesday morning, says sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X