జైల్లో ఉన్నా, బయట ఉన్నా మద్దతివ్వాల్సిందే: చాకో

YS Jagan
న్యూఢిల్లీ/హైదరాబాద్: జైల్లో ఉన్నా.. బయట ఉన్నా అందరూ తమకు మద్దతు పలకాల్సిందేనని ఏఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో సోమవారం అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ వైపు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు క్లీన్ చిట్, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కాకతాళీయం అనుకోవచ్చా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు చాకో స్పందించారు.

దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకే మద్దతు పలుకుతారని చెప్పారు. వాళ్లు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తమతో వ్యతిరేకించినా, సఖ్యతగా ఉన్నా ఎన్నికల తర్వాత అందరూ కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏ ముద్దాయి అయినా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని చెప్పారు. దానిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందే అన్నారు.

బెయిల్‌పై ప్రశ్నకు బదులిస్తూ.. తాను దానిపై మాట్లాడదల్చుకోలేదన్నారు. విభిన్న విషయాలను ఒక్కటిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు తాను సహకరించదల్చుకోవడం లేదన్నారు. దేశ పరిస్థితుల్లో ఎక్కువ మంది కాంగ్రెసుకు మద్దతు పలుకుతారని, బిజెపికి కాదన్నారు. ఎన్నికల తర్వాత ఎవరైనా జైల్లో ఉన్నా, బయట ఉన్నా, తమతో విభిదించినా, సఖ్యతగా ఉన్నా అంతా కాంగ్రెసుకు మద్దతివ్వాల్సిందే అన్నారు. జగన్ తమకు మద్దతిస్తున్నారని మీరే చెబుతున్నారని, ఆయన ఏదో ఒకవైపు తప్పితే రెండు వైపులకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. అయితే, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.

అప్పుడు కితాబు.. ఇప్పుడు విమర్శనా: బొత్స

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కితాబిచ్చారని, ఇప్పుడు విమర్శలు గుప్పించడమేమిటని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+