నా ప్రాణం పోయే వరకు సుమలత వెంటే ఉంటా, చాలెంజింగ్ స్టార్, రెబల్ స్టార్ ఫ్యాన్స్ !
కర్ణాటకలోని మండ్య లోక్‌సభ ఎన్నికలపై ఎంపీ సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని సుమలత ఇప్పటికే చెప్పారు. మండ్య ఎంపీ సుమలతో పాటు శ్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు. నటుడు దర్శన్ మాట్లాడుతూ మండ్య జిల్లాలోని ప్రతి అమ్మకు నా కృతజ్ఞతలు, తన ప్రాణం పోయే వరకు తన తల్లి సుమలత అంబరీష్ ను వదిలిపెట్టను అని హీరో దర్శన్ అన్నారు.
తన తల్లి సుమలత తనను పాడుపడిన బావిలో దూకమని చెప్పినా వెనుకా ముందు ఆలోచించకుండా తాను దూకేస్తానని హీరో దర్శన్ అన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హీరో దర్శన్ మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి మండ్యకు వచ్చిన తనకు ఇక్కడి ప్రజలు ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు అందించారని, ఆ అభిమానం తాను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని హీరో దర్శన్ అన్నారు.

మండ్యలో తాను ఏప్రాంతానికి ఎక్కడికెళ్లినా అక్కడ కొబ్బరి నీళ్లు ఇచ్చిన అమ్మలు, అక్కచెల్లెళ్లు తన మీద ఎంతో ప్రేమను చూపించారని, తాను జీవితంలో అలాంటి రోజులు మరిచిపోలేనని హీరో దర్శన్ అన్నారు. మండ్య జిల్లాలోని రైతులకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, మండ్య జిల్లా రైతులందరికీ ఈ సందర్బంగా తాను ధన్యవాదాలు చెబుతున్నానని, గత లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చినప్పుడు మండ్య జిల్లాలోని అమ్మానాన్నలంతా తనకు చాలా ఘనంగా స్వాగతం పలికారని హీరో దర్శన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
మండ్య జిల్లా ప్రజల ప్రేమను ఎప్పటికీ మరువలేనని, ఆ సమయంలో మా అమ్మ సుమలతను ఆదరించిని ప్రతి ఒక్కరిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని హీరో దర్శన్ అన్నారు. యముడు వచ్చి నన్ను పిలిస్తే ఉండు స్వామి, మా అమ్మకు ఒక్క మాట చెప్పి వస్తానని సుమలత ఇంటికి వెళ్లి ఆమెను చివరిసారిగా చూసి వెలుతానని, తనకు అంబరీష్, సుమలత కుటుంబానికి అంత అనుభందం ఉందని హీరో దర్శన్ అన్నారు.

అంబరీష్ ఇంటితో మాకు అలాంటి బంధం ఉందని, అందుకే గత లోక్ సభ ఎన్నికల సమయంలో కుడి చేయి విరిగినా వచ్చి ఎన్నికల ప్రచారం చేశానని, ఇప్పుడు తన ఎడమ చేతికి గాయమైందని, నిజం చెప్పాలంటే ఈరోజు నాకు చేతికి ఆపరేషన్ జరగవలసి ఉందని, అయితే తన తల్లి సుమలత ఈరోజు మండ్యలో అభిమానులతో సమవేశం ఏర్పాటు చేశారని తెలుసుకుని తన ఆపరేషన్ ను రేపటికి వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చానని హీరో దర్శన్ అన్నారు.
ఈ సమావేశం పూర్తి చేసుకుని బెంగళూరు వెళ్లి రాత్రికి హాస్పిటల్ లో అడ్మిట్ అవుతానని, రేపు ఆపరేషన్ చేసుకుంటానని హీరో దర్శన్ వేదికపై నుంచి మండ్య ప్రజలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను రాజకీయాల గురించి మాట్లాడను, అయితే ఒక్కటి మాత్రం చెబుతానని, ఇంట్లో పిల్లలు పిల్లల్లాగే ఉండాలని, మా అమ్మ సుమలత బాగుగురించి నేను జీవితాంతం ఆలోచిస్తానని, తాను చనిపోయే వరకు తన తల్లి తల్లే అని, శిథిలావస్థలో ఉన్న బావిలో నువ్వు దూకు అని సుమలత చెబితే తాను వెనుకాముందు ఆలోచించకుండా దూకేస్తానని, తనను, తన కుటుంబాన్ని అంబరీష్, సుమలత అలా చూసుకున్నారని హీరో దర్శన్ కొంచెం ఉద్వేగంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications