వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: విద్యార్థినిపై పోలీసుల గ్యాంగ్‌రేప్, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

 arrested
చండీగఢ్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారి, ఓ పదవ తరగతి విద్యార్థినిని అపహరించి నెల రోజులకుపైగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ పేర్కొన్నారు. ఐదుగురు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

శనివారం నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న నిందితులందరూ కుదాలాహోర గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులపై ఇప్పటికే సస్పన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. కాగా కేసులో నలుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేయగా, మరో నిందితున్ని శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కీచక పోలీసుల నిర్బంధం నుంచి తప్పించుకు వచ్చిన బాధిత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ జరిపిన అధికారులు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి, పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

కాగా తనను ఐదుగురు పోలీసులు కిడ్నాప్ చేసి, ఆరువారాల పాటు సామూహిక అత్యాచారం చేసినట్లు బాధిత విద్యార్థిని పోలీసు ఉన్నతాధికారులకు తన ఫిర్యాదులో పేర్కొంది. తమకు సహకరించకపోతే చంపేస్తామని తుపాకీతో బెదింపులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడే వారని బాధితురాలు తెలిపింది. కేసు విషయం బయటికి తెలియడంతో ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు శుక్రవారం నగరంలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.

English summary
The police on Friday arrested the fifth tainted cop even as it surfaced that the victim in her complaint made shocking revelations about how she was forced to pop anti-pregnancy pills at pistol point by the cops each time they raped her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X