జాక్ పాట్:రూ.400 వస్తోందనుకొంటే ఏకంగా కోటిన్నర వచ్చింది, ఇల్లు, పెళ్ళి ఖర్చులిలా..

ఆజాద్ సింగ్ అనే 24 ఏళ్ళ యువకుడికి కోటిన్నర రూపాయాల లాటరీ దక్కింది.పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం బంపర్ లాటరీలో కోటిన్నర రూపాయాలు దక్కింది.

హర్యానా:అదృష్ణం దరిద్రం పట్టినట్టు పట్టిందనే నానుడి వినే ఉంటాం. అక్షరాలా హర్యానాకు చెందిన 24 ఏళ్ళ యువకుడి విషయంలో ఇదే జరిగింది. లాటరీలో ఎంతో కొంత వస్తోందనే నమ్మకంతో కొనుగోలు చేశాడు.అయితే అతనికి ఏకంగా కోటిన్నర రూపాయాల బహుమతి వచ్చింది.

హర్యానా రాష్ట్రంలోని ఫతేబాద్ జిల్లా దయ్యార్ గ్రామానికి చెందిన 24 ఏళ్ళ ఆజాద్ సింగ్ చిన్నతనంలోనే స్కూల్ ను మానేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన చదువును మానేశాడు.స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆయన ఎనిమిదో తరగతి వరకు చదివాడు.తర్వాత చదువును ఆపేశాడు.

తమ గ్రామంలోని బస్టాండ్ సమీపంలోని చిన్న దుకాణం పెట్టుకొని పూరిపాకలో ఆజాద్ నివాసం ఉంటున్నాడు.అయితే పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే న్యూ ఈయర్ బంపర్ లాటరీ 2016 టిక్కెట్టును ఆజాద్ సింగ్ కొన్నాడు.

Chandigarh school dropout wins Rs 1.5cr lottery in first try

ఈ టిక్కెట్ ను ఆయన సిర్సాలో కొనుగోలు చేశాడు. అయితే ఈ టిక్కెట్టుపై ఖచ్చితంగా రూ.400 బహుమతి ఉంది.అయితే తాను పెట్టిన పెట్టుబడి నష్టపోకుండా రూ.400 వస్తాయనే నమ్మకంతో ఆయన ఈ టిక్కెట్టును కొనుగోలుచేశాడు.

తొలిసారిగా లాటరీ టిక్కెట్టు...కోటిన్నర విజేత
అయితే జనవరి మాసంలోనే విజేతలను ప్రకటించాలి. కాని పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున విజేతల ప్రకటన ఆలస్యమైంది.ఇటీవలనే ఈ లాటరీ విజేతలను ప్రకటించారు.దీంతో కోటిన్నర రూపాయాలను ఆజాద్ సింగ్ గెలుచుకొన్నారు.

రెండు రోజుల క్రితమే లాటరీ విజేతల గురించి వాకబు చేస్తే తన లాటరీకి కోటిన్నర రూపాయాల ప్రైజ్ మనీ వచ్చిన విషయం తెలుసుకొని సంతోషపడినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ విషయాన్ని తాను నమ్మలేకపోయాయని చెప్పారు.

ఒకటికి పదిసార్లు ఈ విషయాన్ని సరిచూసుకొన్నానని ఆయన చెప్పారు. కోటిన్నర రూపాయాల ప్రైజ్ మనీ వచ్చిన విషయం నిర్ధారించుకొన్న తర్వాత స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.స్వంత ఇల్లు కట్టుకొంటానని చెప్పాడు. దేవుడికి కొంత బహుమానంగా హుండీలో వేయనున్నట్టు చెప్పారు. పెళ్ళి చేసుకొని స్వంత వ్యాపారం పెట్టుకొంటానని ఆజాద్ సింగ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+