చెన్నై ఎందుకు, తిరుపతిలో దిగండి: మోడీకి బాబు

హైదరాబాద్: తమ రాష్ట్రంలోనే దిగాలని, తిరుపతిలో కూడా మంచి విమానాశ్రయమే ఉందని, వసతులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పారు. ఇక్కడ దిగితే తిరుపతి విమానాశ్రయాన్ని చూసినట్టుగా కూడా ఉంటుందని ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ నెల 29న నెల్లూరుజిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి రానున్న ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శ్రీహరికోటకు రావాలని ప్రధాని భావించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ముందుగా కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రొటోకాల్ ప్రకారం ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరింది.

Chandrababu appeals to Modi to land at tirupathi

దానిపై చంద్రబాబు స్పందించి, తిరుపతి విమానాశ్రయానికి రావాలని ప్రధానిని కోరారు. మోడీకి చంద్రబాబు ఫోన్ చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయానికి వచ్చే అవకాశం ఉండగా, చెన్నైకు వెళ్లి అక్కడి నుంచి రావాల్సినంత అవసరం ఏముందని ఆన అన్నారు. తిరుపతి నుంచి శ్రీహరికోట కూడా చాలా దగ్గర అవుతుందని, ప్రధానికి స్వాగతం చెప్పడానికి తాముంతా ముందు ఉంటాంమని ఫోన్‌లో మోదీకి విన్నవించారు. ఇందుకు ప్రధాని కూడా అంగీకరించిన ట్టు సమాచారం.

ఇదిలావుంటే, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26, 27 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు వెల్లడించారు. ఆదివారం కోటయ్య కమిటీ కలిసిన తర్వాత ఢిల్లీ పర్యటన ఎజెండాను చంద్రబాబు ఖరారు చేశారు. అనంతరం కంభంపాటి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులను త్వరితగతిన తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+