తోక జాడించారు: వరంగల్ జిల్లాలో గర్జించిన చంద్రబాబు

వరంగల్: తెలంగాణను అభివృద్ధి చేసింది ఎవరో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే తోక ముడిచారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)పై విరుచుకుపడ్డారు. హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బయ్యారం గనులను అల్లుడికి కట్టబెడితే పోరాడింది తమ పార్టీయేనని ఆయన అన్నారు. హైదరాబాదులో భూఆక్రమణలకు, వివక్షారహితమైన కేటాయింపులకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడమని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజనపై తాను క్రమపద్ధతిలో ముందుకు వెళ్లానని ఆయన అన్నారు. తనకు ఇబ్బంది అయినా ఫరవా లేదని, కార్యకర్తలకు ఇబ్బంది కలగకూడదని, తాను తటస్థంగా ఉంటానని చెప్పి అలా ముందుకు సాగానని ఆయన అన్నారు. మనకు కొన్ని ఇబ్బందులు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నాయని ఆయన అన్నారు. కరెంట్ కొరత ఉంటుందని, అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని తాను అప్పుడే చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణకు ఆదాయం ఎక్కువగా ఉంటుందని, అలా ఉండే విధంగా చేసింది తానేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని తాను ఆ రోజు అన్నానని, చట్టం పెట్టిన కాంగ్రెసు గతి లేదని, ఇప్పటి ప్రభుత్వం ఇప్పటికీ ఏమీ చేయడం లేదని ఆయన అన్నారు.

విభజన సమయంలో తమను అనేక ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. తెలంగాణకు ఆదాయం ఎక్కువగా ఉందంటే తాను సంతోషించానని, ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని మాత్రమే అడిగానని, ఎపికి రాజధానిని కట్టుకోవాలని, రెండు మూడు జిల్లాలు దాటి వెళ్లాలంటే ఇబ్బందులుంటాయని, త్వరగా రాజధానిని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని ఆయన అన్నారు. హెటెక్స్ సిటీ, రింగ్ రోడ్లు తానే సృష్టించానని ఆయన అన్నారు. తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని, తాను పిరికివాడిని కాదని, తెలంగాణపై అభిమానం ఉందని, హైదరాబాదుపై మవకారం ఉందని ఆయన అన్నారు. రాజకీయాలు దిగజారిపోయాయని, అనని మాటలను అన్నాన్నట్లు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. హైదరాబాదు నుంచి పాలన చేస్తుంటే విదేశం నుంచి చేస్తున్నట్లు ఉందని తాను అన్నట్లు జరిగిన ప్రచారంపై ఆయన ఈ వివరణ అంతా ఇచ్చారు.

గతంలో కూడా వ్యవసాయం దండుగ అన్నట్లు ప్రచారం చేశారని, కాంగ్రెసు వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, టిడిపిని చూస్తే గుండెల్లో రైళ్లు పరుగుపెడుతున్నాయి కాబట్టే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కరెంట్ విషయం తాను స్పష్టంగా చెప్పానని, చట్టంలో ఉన్నదానికి కట్టుబడి ఉంటానని, కృష్ణపట్నం విషయాన్ని రెగ్యులేటర్ కమిషన్ అంగీకరించలేదని, అయినా పూర్తిగా సహకరిస్తానని చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి కూడా కరెంట్ కావాలని ఆలోచన చేశానని, తనకున్న అనుభవంతో కరెంట్ కొన్నానని, బొగ్గు లేకపోతే దిగుమతి చేసుకున్నామని ఆయన చెప్పారు.

Chandrababu challenges TRS in Telangana

విభజన సమస్యలను తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. అసలే ఆదాయం లేనప్పటికీ ముందుగానే కరెంట్ కొన్నామమని, కరెంట్ ఇవ్వగలుగుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణలో పొలాలు ఎండిపోవడానికి వీలు లేదని ఆయన అన్నారు. కూర్చుందాం, మాట్లాడుకుందాం, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పానని, దానికి ఇప్పటి వరకు స్పందన రాలేదని, కేంద్ర మంత్రితో తొలి సమావేశంలోనే తెలంగాణ కరెంట్ సమస్యను పరిష్కరించాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎపిలో 24 గంటలు ఇవ్వడానికి కేంద్రంతో ఒప్పందానికి వచ్చామని, కొంత కొన్నామని, బయటపడ్డామని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చనని, తాను అందుకు సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. సాగునీటి విషయంలో లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని, కరువు వల్ల రెండు ప్రాంతాల్లో కాస్తా ఎక్కువ నీరు వాడుకున్నారని ఆయన అన్నారు. నాఫ్తా కోసం ప్రయత్నాలు చేస్తున్నానని, అది సాకారమైతే తెలంగాణకు కరెంట్ కష్టాలు పోతాయని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+