వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలియని వ్యక్తా, భేటీ అవుతా: కెసిఆర్‌పై బాబు అసహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో విద్యుత్ రంగంపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

కృష్ణా డెల్టా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాగునీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం కాదని, ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లో ఉందని, దీనిపైన ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఏమిటని కెసిఆర్‌పై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా కూల్చివేతలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.

ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను మొగ్గలోనే తుంచేసేందుకు వీలుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడంలో తప్పేమిటని మీడియా ప్రతినిధులు అడిగితే చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తాను కెసిఆర్‌తో భేటీ అవుతానని, తనకు ఎలాంటి భేషజాలూ లేవని, పైగా కెసిఆర్ తనకు తెలియని వ్యక్తి కాదని, పరిచయం ఉందని అన్నారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కెసిఆర్‌తో సమావేశమయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

రెండు రాష్ట్రాల అభివృద్ధినీ తమ తెలుగుదేశం పార్టీ కాంక్షిస్తోందని అన్నారు. తమ పార్టీపై నమ్మకంతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఇస్తే తెలంగాణలో 22 నుంచి 23 శాతం ఓటర్లు తమకు అండగా నిలిచారని ఎమ్మెల్యేలను గెలిపించారని చంద్రబాబు అన్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తామని చెప్పారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా రెండు రాష్ట్రాలకూ విద్యుత్‌ను ఇవ్వాలని కోరానని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే లక్ష్యమని చెప్పారు.

కెసిఆర్‌తో పరిచయం ఉంది..

కెసిఆర్‌తో పరిచయం ఉంది..

కెసిఆర్ తనకు తెలియని వ్యక్తి కాదని, ఆయనతో సమావేశమయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

కెసిఆర్‌పై అసహనం

కెసిఆర్‌పై అసహనం

నాగార్జునసాగర్ నుంచి డెల్టాకు నీరు విడుదల చేసే సంప్రదదాయం ఎప్పటి నుంచో ఉందని, దానిపై విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమిటని చంద్రబాబు కెసిఆర్‌పై అసహనం వ్యక్తం చేశారు.

రెండు రాష్ట్రాల అభివృద్ధి

రెండు రాష్ట్రాల అభివృద్ధి

తమ తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తోందని, రెండు రాష్ట్రాలకూ విద్యుత్తు ఇవ్వాలని తాను కేంద్రాన్ని కోరానని చంద్రబాబు చెప్పారు.

భేటి అయితే తప్పేమిటి...

భేటి అయితే తప్పేమిటి...

సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయితే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that he is ready to meet Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X