చంద్రబాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు: మమతా బెనర్జీ వ్యాఖ్యలు
Recommended Video

కోల్‌కతా: కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐకి ఏపీలో దాడులు, దర్యాఫ్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సంచలన నిర్ణయం తీసుకోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం స్పందించారు. చంద్రబాబుకు ఆమె మద్దతుగా నిలిచారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నారు. కేంద్ర సంస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.

రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వును గురువారం చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు నిర్ణయంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు వేరుగా మండిపడ్డారు. ఏపీలో ప్రయివేటు కంపెనీలపై ఆదాయపన్ను శాఖ దాడులు జరిగితే తన మీద దాడులు జరిగినట్లు చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. వారం రోజులుగా చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా బెంబేలెత్తుతున్నారో గమనిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఒక అవినీతి కూటమి కోసం రెండుసార్లు ఢిల్లీ వచ్చి వెళ్లారన్నారు.
రాష్ట్రంలో సిబిఐ అడుగుపెట్టేందుకు అనుమతి ఉపసంహరించుకుంటూ గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎపిలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు.
అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందని...అందువల్ల రాష్ట్రంలో ఇక ఆ సంస్థ జోక్యం అనవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.












Click it and Unblock the Notifications