ఇస్రో నెక్స్ట్ టాస్క్ ఇదే- తొలి అంతరిక్ష కేంద్రంగా ఆవిర్భావం
తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. సూర్యుడిపై ప్రయోగాలకు సన్నద్ధమైంది. దీనికోసం ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. త్వరలోనే ఈ రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధం అయ్యాయి. ఇప్పటికే ఈ రాకెట్, శాటిలైట్ బెంగళూరులోని యూఆర్ రావు సెంటర్ నుంచి శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది కూడా.

ఆదిత్య ఎల్ 1 ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్1ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ప్రయోగ తేదీని వెల్లడిస్తామని అన్నారు. శనివారం రాత్రి ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.
సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్1 ప్రయోగానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు చెప్పారు. ప్రయోగించిన రోజు నుంచి ఈ శాటిలైట్ సూర్యుడిని దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని, 120 రోజుల తరువాత ఎల్ 1 పాయింట్‌ను సమీపిస్తుందని సోమనాథ్ వివరించారు. పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను దీనికోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే.. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి శాటిలైట్‌ను పంపించిన మొట్టమొదటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇదే అవుతుంది. భూమి-సూర్యుడి మధ్య ఉన్న దూరం 1.5 మిలియన్ కిలోమీటర్లు. ఎల్ 1 అంటే లాగ్ రేంజ్ పాయింట్ అని అర్థం. హాలో కక్ష్యలో ఈ శాటిలైట్‌ను పరిభ్రమింపజేయడం ద్వారా సూర్యుడి నుంచి వెలువడే ధాతువులపై నిరంతరం అధ్యయనం చేయగలుగుతుంది ఇస్రో.












Click it and Unblock the Notifications