Chandrayaan-3: చంద్రుడికి అడుగు దూరంలో - ఇక, కాలుమోపటమే మిగిలింది..!!
చంద్రయాన్-3 లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ -3 ప్రధాన దశకు చేరుకుంది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. రెండో, చివరి డీ - బూస్టింగ్ ను విజయవంతంగా పూర్ి చేసినట్లు శనివారం అర్ద్రరాతి దాటిన తరువాత ఇస్రో ప్రకటించింది. దీని ద్వారా చంద్రుడికి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. ఇక, కాలుమోపే అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది.
ఇస్తో శాస్త్రవేత్తలు మరో విజయం సాధించారు. చంద్రయాన్ -3 లో ఫైనల్ డీ బూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్ ను దిగువ కక్ష్యకు చేర్చారు. దీంతో ఈ నెల 23న సాయంత్రం 5.45 గంటలకు చంద్రుడు పై అడుగు పెట్టే ప్రక్రియపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రుడి అతి దగ్గర కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేసింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కిలో మీటర్లు, అత్యధికంగా 134 కిలో మీరట్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తి కావటంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగటమే మిగిలి ఉంది. దీంతో, ఇస్రో శాస్త్రవేత్తలు మరింత అలర్ట్ అయ్యారు.

Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 19, 2023
The second and final deboosting operation has successfully reduced the LM orbit to 25 km x 134 km.
The module would undergo internal checks and await the sun-rise at the designated landing site.
The powered descent is expected to commence on August… pic.twitter.com/7ygrlW8GQ5












Click it and Unblock the Notifications