జాబిలమ్మను చేర ఇంకా ఆలస్యం -చంద్రయాన్-3 వాయిదా -ఇస్రో చీఫ్ శివన్ కీలక ప్రకటన

జాబిలమ్మను చేరుకోవాలన్న భారత్ కల ఇంకాస్త ఆలస్యం కానుంది. చంద్రుడిని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌ 3 వాయిదాపడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఇస్రో ప్ర‌ధాన ప్రాజెక్టులు ఆల‌స్య‌మైన క్రమంలో వాటిపై ఇస్రో చీఫ్ శివన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

2019 సెప్టెంబరు నాటి చంద్రయాన్‌-2 ప్రయోగం తృటిలో విఫలమైననా.. పట్టు వదలకుండా ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగించి.. 2020 డిసెంబర్ లోనే చంద్రయాన్-3ని లాంచ్ చేయాలనుకుంది. కానీ, కొవిడ్‌-19 ప్రభావం చంద్రయాన్‌-3, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్టు సంస్థ చైర్మన్‌ శివన్‌ వివరించారు.

Chandrayaan-3 Launch Delayed Further to 2022, Says ISRO Chief K Sivan

''ఈ ప్రయోగాల విషయమై మేము పరిశోధనలు జరుపుతున్నాము. ఇది కూడా చంద్ర‌యాన్‌-2 కాన్ఫిగ‌రేష‌న్ వంటిదే. కానీ ఇందులో ఆర్బిట‌ర్ ఉండ‌దు. చంద్ర‌యాన్‌-2లో లాంచ్ చేసిన ఆర్బిట‌ర్‌నే చంద్ర‌యాన్‌-3కి వాడుకుంటాము. ఈ నేపథ్యంలో ఈ మిషన్‌ను వచ్చే 2022 సంవత్సరంలో ప్రయోగించేందుకు కృషి చేస్తున్నాం'' అని శివన్‌ తెలిపారు.

ఇస్రో భవిష్యత్తులో పలు గ్రహాంతర యాత్రలను చేపట్టనున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని చాటిచెప్పే గీటురాయిగా చంద్రయాన్‌-3 కీలకం కానుంది. ఈ ప్రయోగం అనంతరం ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌-3 ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామని శివన్‌ తెలిపారు. ఇందుకుగానూ నలుగురు భారత వ్యోమగాములు అవసరమైన శిక్షణ పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఇప్ప‌టికే దీని కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ర‌ష్యాలో శిక్ష‌ణ పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+