వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులంటే నెగటివ్ అభిప్రాయం పోయేలా చేయండి: ఐపీఎస్ ప్రొబేషనర్లకు ప్రధాని మోదీ హితవు

|
Google Oneindia TeluguNews

ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకమైన అభిప్రాయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. పోలీస్ వ్యవస్థపై మచ్చలు తొలిగిపోయి, జనంలో నెగటివ్ అభిప్రాయం పోయేలా, ఈ వ్యవస్థ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

కరోనా మహమ్మారి ప్రారంభ దశలో పోలీసులపై ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం తాత్కాలికంగా మారిందని, అయితే మళ్ళీ పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయని ప్రధాని అన్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో శనివారం ఆయన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.

 Change negative perception of police: PM Modi to IPS probationers

దేశ చరిత్రలో ప్రస్తుత దశ ఎంతో కీలకమైందని, ఇటువంటి సమయంలో పోలీసులు తమ వ్యవస్థ పేరు, ప్రతిష్ఠలు మెరుగుపడటానికి కృషి చేయాలన్న ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్)ను ఉదాహరణగా చూపించారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అందజేసే సేవలపై ప్రజలకు గొప్ప నమ్మకం ఏర్పడిందన్నారు.

చైనాలో మళ్లీ కరోనా విలయం -బీజింగ్ సహా 15 ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ విజృంభణచైనాలో మళ్లీ కరోనా విలయం -బీజింగ్ సహా 15 ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ విజృంభణ

స్వాతంత్ర్యం తరువాత గడిచిన 75 ఏళ్ళలో పోలీస్ శిక్షణను మెరుగుపరచడానికి భారత్ విశేషంగా కృషి చేసిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన నిబంధనావళిని విధించే విషయాన్ని పరిశీలించాలని ప్రధాని మోదీ అన్నారు. ఆల్వేస్ నేషన్ ఫస్ట్ అనే మంత్రాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఐపీఎస్ ట్రైనీలు స్థానికంగా ఎదురయ్యే సమస్యలు ఏవైనప్పటికీ, ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

 Change negative perception of police: PM Modi to IPS probationers

బాధ్యతాయుతమైన పోలీసింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కోసం దశాబ్దాల తరబడి కొనసాగుతున్న తప్పుడు విధానాలను, సంప్రదాయ కట్టుబాట్లను ప్రతి రోజూ తమ విధి నిర్వహణలో ఎదిరించవలసి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ''మీరు వ్యవస్థను మార్చుతారా? లేదంటే మిమ్మల్నే వ్యవస్థ మార్చుతుందా? అనేది మీ ఆలోచనా విధానంపైనే ఆధారపడి ఉంటుంది. అనేక విధాలుగా ఇది మీ ముందు పెట్టిన మరొక పరీక్ష'' అని చెప్పారు.

Recommended Video

Engineering Courses In 5 Local Languages - PM Modi | Oneindia Telugu

ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనీలు పోలీస్ అకాడమీలో తమ అనుభవాలను మోదీకి వివరించారు. ప్రొబేషనర్లతో మోదీ మాట్లాడుతూ వారి అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ అధికార పరిధిలోని భద్రతా పరిస్థితులతో ఏ విధంగా వ్యవహరించాలనుకుంటున్నదీ అడిగారు. వ్యక్తిత్వ లక్షణాలు, నేపథ్యాల నుంచి వచ్చిన అనుభవం వంటివాటిని ఉపయోగించి ఏ విధంగా పని చేస్తారో అడిగి తెలుసుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday told Indian Police Service (IPS) probationers that the spirit of ‘Nation First, Always First’ should be reflected in every action of theirs and they should also work towards changing the negative perception of the force among people. He urged the IPS probationers to keep national interest in mind and have a national perspective while taking decisions when they are in the field.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X