బెంగళూరులో మోదీ రోడ్ షోలో మార్పులు, లాభాలతో పాటు నష్టాలు ?

బెంగళూరు: బెంగళూరులో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారని, అందువల నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురౌతాయని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో బీజేపీ నాయకులు ఇబ్బందులకు గురి అయ్యారు.

శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ విజయ్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ విచారణ చేసింది. ఆదివారం బెంగళూరులో నీట్ పరీక్షలు జరుగుతున్నందు వలన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడాదని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది హైకోర్టుకు మనవి చేశారు.

Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని ప్రాంతాల్లోనే రోడ్ షో నిర్వహిస్తున్నారని, ఆ ప్రాంతంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులులేవని బీజేపీ తరపున న్యాయవాది వాదించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11. 30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించడానికి కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రజల నుంచి ఎక్కువగా విమర్శలు వస్తుండటంతో మోదీ రోడ్ షోతో ఎంత లాభాలు ఉన్నాయో అంతే నష్టం కూడా వస్తుందని కొందరు బీజేపీ నాయకులు భయపడిపోయారు. ఆదివారం జరిగే రోడ్ షో గురించి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన నాయకులు కొన్ని మార్పులు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మోదీ రోడ్ షో మొదలై ఉదయం 11.30 గంటలకు పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని తిప్పసంద్రలోని కెంపేగౌడ విగ్రహం దగ్గర ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మొదలౌతుంది. తిప్పసంద్ర నుంచి మొదలు అయ్యే ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఉదయం 11. 30 గంటలకు ట్రినిటి సర్కిల్ లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో పూర్తి అవుతుందని బీజేపీ నాయకులు తెలిపారు.

Narendra Modi

ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెంగళూరు దక్షిణ ప్రాంతాలు, శివాజీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. ఒకే రోజు బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+