చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్, 9మంది గల్లంతు

భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న క్రమంలో పలు ప్రాంతాలలో రహదారులపై భారీగా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. అంతేకాదు ఉత్తర కాశీలోని బాలిగడ్ లో ఆకస్మిక వర్షం కారణంగా గణనీయమైన నష్టం జరిగింది.

ఒకరోజు పాటు చార్ ధామ్ యాత్ర నిలిపివేత
క్లౌడ్ బరస్ట్ తో 9మంది కార్మికులు గల్లంతు కావడంతో ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు పాటు చార్ ధామ్ యాత్ర ను నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు నేడు అధికారికంగా ప్రకటన వెలువరించింది. మే 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

char dham yatra suspended due to heavy rains along with cloud burst incident in uttar kashi

గంగోత్రి, యమునోత్రిలలో ప్రారంభమైన యాత్ర
గంగోత్రి, యమునోత్రి లలో ఈ యాత్ర ప్రారంభం కాగా, ఈ యాత్ర తో పాటుగా కేదార్నాథ్, మే 4వ తేదీన బద్రీనాథ్ యాత్రకు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నాలుగు దేవాలయాలు సంవత్సర కాలంలో ఆరు మాసాలు మాత్రమే తెరిచి ఉంటాయి. శీతాకాలంలో భారీ చలిగాలులు మంచుతో కప్పి ఉండటం వల్ల ఈ ఆలయాలు మూసి ఉంచుతారు. మళ్లీ ప్రస్తుతం తెరిచి ఉంచే ఈ ఆలయాలను దర్శించడానికి భక్తులు వస్తారు.

కొండ చరియలు విరిగిపడి మూసుకుపోయిన రహదారులు
అయితే అత్యంత క్లిష్టమైన యాత్రగా ఈ యాత్రలకు పేరు ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ యాత్రలు చేసేందుకు పర్యాటకులకు అన్ని వసతులను కల్పిస్తుంది. ఈ క్రమంలోనే చార్ ధామ్ యాత్ర చేస్తున్నటువంటి వారికి తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భారీగా కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో రహదారులు మూసుకుపోయాయి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.

శిధిలాలు తొలగించాక చార్ ధామ్ యాత్ర
ఈ క్రమంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని యాత్రికులకు ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆజ్ఞలు వచ్చేవరకు యాత్ర చేయొద్దని సూచించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత రహదారులపైన శిధిలాలను శుభ్రం చేసిన తర్వాత యాత్ర చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, సోన్ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్, వికాస్ నగర్ తదితర ప్రాంతాలలో యాత్రికులు తాత్కాలికంగా నివసించడానికి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పోలీసులకు, ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా ఘర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+