ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన నక్సల్స్: బాంబు దాడిలో 11మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. నక్సలైట్లు మందుపాతరను పేల్చివేశారు. ఈ పేలుడులో 11 మంది జవాన్లు అమరులయ్యారు.అమరవీరుల్లో 10 మంది జవాన్లు ఉండగా, ఒకరు డ్రైవర్ కూడా మృతి చెందాడు. పేలుడు తర్వాత ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు. ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని రప్పించారు.

నక్సల్స్ యాంటీ ఆపరేషన్ నిర్వహించి వీరు తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది.నక్సలైట్ల దాడిలో అమరులైన జవాన్లు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు. ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖలో వీరిది ప్రత్యేకమైన దళంగా గుర్తిస్తారు.వీరంతా స్థానిక గిరిజనలు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో అక్కడి గిరిజనులకు మావోలను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తోంది పోలీస్ శాఖ.

chhattisgarh naxal attack

బస్తర్‌ బెల్ట్‌లో చాలావరకు జరిగిన నక్సల్స్ ఆపరేషన్‌లో డీఆర్‌జీలు సక్సెస్ అయ్యారు. దాడి జరిగిందని తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.మరోవైపు సీఎం భగేల్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరులైన కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై మావోలు యుద్ధం ప్రకటించారు. ఈ క్రమంలోనే గత ఆరు దశాబ్దాలలో కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయి. పేదలకు అండగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని నక్సల్స్ చెబుతున్నారు. పేదలను దేశ ఆర్థికవ్యవస్థలో విస్మరించారని మావోలు ఆరోపిస్తున్నారు.

chhattisgarh naxal attack

1967 నుంచి మావోల కార్యకలాపాలు క్రమంగా విస్తరించాయి.దేశ అంతర్గత భద్రతకు మావోలు ముప్పుగా పరిగణించారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.రెడ్ కారిడార్ పేరుతో వీరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దట్టమైన అడవులను కేంద్రంగా చేసుకుని ఆపరేషన్స్ సాగిస్తుంటారు. ఇది అత్యంత రహస్యంగా నిర్వహిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+