కన్న తండ్రినే జైలుకు పంపిన సీఎం-ఛత్తీస్ ఘడ్ లో అరుదైన ఘటన
ఛత్తీస్ ఘడ్ లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఎం భూపేష్ బఘేల్ తీసుకున్న ఓ నిర్ణయం ఆ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న తన తండ్రి నందకుమార్ బఘేల్ ను సీఎం భూపేష్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపేలా చేశారు.
ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్. ఆయన వయస్సు 86 సంనత్సరాలు. తాజాగా ఆయన బ్రహ్మణులకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రంలో రచ్చ చోటు చేసుకుంది. విపక్షాలు భూపేష్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో ఆయన కూడా వీటిని సీరియస్ గా తీసుకున్నారు. తన తండ్రి తప్పు చేశాడని గుర్తించి ఆయనపై చట్ట ప్రకారం చర్యలకు దిగారు. ఏకంగా అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఛత్తీస్ ఘడ్ లో బ్రహ్మణులు విదేశీయులని, వారు గంగా నుంచి ఓల్గాకు వెళ్లేందుకు సిద్ఘంగా ఉండాలని సీఎం భూపేష్ తండ్రి నంద్ కుమార్ తాజాగా వ్యాఖ్యానించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు రాయ్ పూర్ లోని స్ధానిక డీడీ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు ప్రభుత్వాన్ని సంప్రదించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సీఎం తండ్రి నంద్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయన్ను రాయ్ పూర్ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
తన తండ్రి నంద్ కుమార్ అరెస్టుపై సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ లో ఉన్నది న్యాయపాలన పాటించే ప్రభుత్వమని, తప్పుచేస్తే 86 ఏళ్ల తండ్రిని కూడా జైలుకు పంపిన సీఎం అని వ్యాఖ్యానించారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. వివిధ సామాజిక వర్గాల మధ్య, కుల మతాల మధ్య శాంతిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన తండ్రి నిజంగానే ఓ కులానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉంటే తనను క్షమించాలన్నారు. తన తండ్రితో తనకు సైద్ధాంతికపరమైన విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలుసని, తమ అభిప్రాయాలు వేర్వేరని సీఎం అన్నారు.












Click it and Unblock the Notifications