శుభవార్త: పెట్రోల్ ధరలు తగ్గుతాయి, మిథనాల్ పాలసీ: నితిన్ గడ్కరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: త్వరలోనే పెట్రోల్ ధరలు తగ్గనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మిథనాల్ పాలసీని గురువారం నాడు కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మిథనాల్‌ను 15 శాతం పెట్రోల్‌లో కలవడం వల్ల పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని నితిన్ గడ్కరీ లో‌క్‌సభలో ప్రకటించారు.

షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, లీటర్‌కు రూ.300, ఎందుకంటే?

పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. సరుకుల రవాణాపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం ఆ మేరకు మాత్రం తగ్గలేదు.

శుభవార్త: పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్, కేంద్రం ప్లాన్ ఇదే

ఇటీవల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల ప్రభుత్వాలపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తోంది.

పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గుదలకు ప్రభుత్వం ప్లాన్

పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గుదలకు ప్రభుత్వం ప్లాన్

పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్ మిశ్రమాన్ని కలిపితే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు లో‌క్‌సభలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించారు. మిథనాల్ మిశ్రమం కలపడం వల్ల పెట్రోల్ ధరలు దిగొచ్చే అవకాశం ఉందన్నారు.

ఖర్చు చాలా తక్కువ

ఖర్చు చాలా తక్కువ

లీటర్ పెట్రోల్ ధర రూ.80 .బొగ్గు నుండి ఉత్పత్తికి అయ్యే మిథనాల్‌ ఖర్చు కేవలం రూ. 22లు మాత్రమేనని చెప్పారు. ఈ మిశ్రమాన్ని పెట్రోల్‌లో కలిపితే కాలుష్యం కూడ తగ్గే అవకాశం ఉందని నితిన్ గడ్కరీ చెప్పారు.

మిథనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు

మిథనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు

ముంబై చుట్టూ ఉన్న పలు కంపెనీలు మిథనాలు ఉత్పత్తి చేస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కొత్త విధానం ద్వారా ఖర్చులు కూడ బాగా తగ్గనున్నాయని చెప్పారు. కాలుష్యం కూడ తగ్గనుందన్నారు.

మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజన్లు

మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజన్లు


చైనాలో మిథనాల్‌ను రూ.17కే ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. స్వీడన్‌ ఆటో మేజర్‌ వోల్వో మిథనాల్‌తో నడిచే స్పెషల్‌ ఇంజీన్‌ను రూపొందించిందనీ, లోకల్‌గా తయారైన ఇంధనతో 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Union Government has announced that Methanol Policy which calls for 15% blending of Methanol in petrol to make it cheaper and also reduce pollution.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి