Cheating: ఫైనాన్స్ కంపెనీ మేనేజర్, భార్యకు కూడా చిన్న క్లూ చిక్కలేదు, గోవా, కేరళలో ఎంజాయ్, టీస్టాల్ లో !
బెంగళూరు/మండ్య/హాసన్: స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీమంతుడు ఫైనాన్స్ కంపెనీ పెట్టాడు. ఇదే పైనాన్స్ కంపెనీలో ఓ వ్యక్తి మేనేజర్ గా ఉద్యోగంలో చేరాడు. మొదట్లో నమ్మకంగా వడ్డీ వ్యాపారం చేసిన ఆ కంపెనీ నిర్వహకులు తరువాత బంగారు నగలు కుదువ పెట్టుకుని రుణం ఇవ్వడం మొదలు పెట్టాడు. నమ్మకంగా ఉంటున్న మేనేజర్ కు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు కుదువ పెట్టుకుంటున్న వ్యాపారం అప్పగించారు. ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న అతను నగలు కుదువ పెట్టిన వాళ్లకు కుచ్చుటోపీ పెట్టడానికి సిద్దం అయ్యాడు. తక్కువ వడ్డీకి నగలు కదుపు పెట్టుకున్న తరువాత ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ నగలు వేరే చోట కుదువ పెట్టి లావాదేవీలు చెయ్యడం మొదలు పెట్టాడు. రానురాను ఖాతాదారులు ఫిర్యాదులు ఎక్కువ చెయ్యడంతో ఫైనాన్స్ సంస్థ నిర్వహకులు ఆ కంపెనీ మేనేజర్ ను నిలదీశారు. తన మ్యాటర్ లీక్ అయ్యిందని తెలుసుకున్న మేనేజర్ 2 కేజీలకు పైగా బంగారు నగలతో ఎస్కేప్ అయ్యాడు. కొన్ని నెలల నుంచి మేనేజర్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కనీసం భార్య, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా అతను ఫోన్ చెయ్యకపోవడంతో అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు. లూటీ చేసిన బంగారు నగలు అమ్మేసి ఇంతకాలం జల్సా చేసిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తరువాత డబ్బులు మొత్తం ఖాళీ కావడంతో వేరే జిల్లాలో టీస్టాల్ లో చిన్న ఉద్యోగంలో చేరాడు. చేసిన పాపం ఊరికేపోదు అనే సామెత లాగా సంవత్సరం తరువాత అతను పోలీసులకు చిక్కిపోయాడు.

ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్
కర్ణాటకలోని మండ్య జిల్లాలోని మద్దూరులో స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీమంతుడు ఐఐఎఫ్ఎల్ అనే ఫైనాన్స్ కంపెనీ పెట్టాడు. ఇదే పైనాన్స్ కంపెనీలో శివశంకర్ అనే వ్యక్తి మేనేజర్ గా ఉద్యోగంలో చేరాడు. మొదట్లో నమ్మకంగా వడ్డీ వ్యాపారం చేసిన ఆ కంపెనీ నిర్వహకులు తరువాత బంగారు నగలు కుదువ పెట్టుకుని రుణం ఇవ్వడం మొదలు పెట్టాడు.

చేతివాటం చూపించిన మేనేజర్
నమ్మకంగా ఉంటున్న మేనేజర్ శివశంకర్ కు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు కుదువ పెట్టుకుంటున్న వ్యాపారం అప్పగించారు. ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న శివశంకర్ నగలు కుదువ పెట్టిన వాళ్లకు కుచ్చుటోపీ పెట్టడానికి సిద్దం అయ్యాడు. తక్కువ వడ్డీకి నగలు కదుపు పెట్టుకున్న తరువాత శివశంకర్ ఎక్కువ వడ్డీ వస్తుందని ఆ నగలు వేరే చోట కుదువ పెట్టి లావాదేవీలు చెయ్యడం మొదలు పెట్టాడు.

3 కేజీల నగలతో గ్రేట్ ఎస్కేప్
శివశంకర్ తీరుతో ఫైనాన్స్ కంపెనీలో నగలు కుదువ పెట్టిన వాళ్లకు అనుమానం ఎక్కువ అయ్యింది. రానురాను ఖాతాదారులు ఫిర్యాదులు ఎక్కువ చెయ్యడంతో ఫైనాన్స్ సంస్థ నిర్వహకులు ఆ కంపెనీ మేనేజర్ శివశంకర్ ను నువ్వు ఏం చేస్తున్నావు అంటూ నిలదీశారు. తన మ్యాటర్ లీక్ అయ్యిందని తెలుసుకున్న మేనేజర్ శివశంకర్ 10 నెలల క్రితం రూ. కోట్ల రూపాయల విలువైన 2 కేజీల 950 గ్రాముల బంగారు నగలు, రూ. 12 లక్షల నగదుతో ఎస్కేప్ అయ్యాడు.

గోవా, కేరళ, తమిళనాడులో ఎంజాయ్
మేనేజర్ శివంకర్ మీద 2021 జూన్ 6వ తేదీన మద్దూరులో కేసు నమోదు అయ్యింది, తన భర్త శివశంకర్ కనపడటం లేదని అతని భార్య కూడా మద్దూరులో పోలీసు కేసు పెట్టింది. ఖాతాదారుల బంగారు నగలతో మాయం అయిన శివశంకర్ ఆ నగలు విక్రయించి కేరళ, తమిళనాడు, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు.

టీ స్టాల్ లో చేరి చిక్కిపోయాడు
కొన్ని నెలల నుంచి మేనేజర్ శివశంకర్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కనీసం భార్య, బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా అతను ఫోన్ చెయ్యకపోవడంతో శివశంకర్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. లూటీ చేసిన బంగారు నగలు అమ్మేసి ఇంతకాలం జల్సా చేసిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ శివశంకర్ తరువాత డబ్బులు మొత్తం ఖాళీ కావడంతో హాసన్ జిల్లాలోని టీస్టాల్ లో చిన్న ఉద్యోగంలో చేరాడు. చేసిన పాపం ఊరికేపోదు అనే సామెత లాగా సంవత్సరం తరువాత శివశంకర్ మద్దూరు పోలీసులకు చిక్కిపోయాడు.












Click it and Unblock the Notifications