అందచందాలతో వల, 7పెళ్లిళ్లు: యువతి అరెస్ట్(వీడియో)
చెన్నై: ధనవంతులైన యువకులకు వల వేస్తూ.. తన అందచందాలు చూపించి, మాయమాటలతో ముగ్గులోకి దింపుతుంది. ఆ తర్వాత వారితో పెళ్లి చేసుకొని, ఆపై వారి వద్ద గల సొమ్ముతో ఉడాయిస్తోంది. ఇలా ఏడుగురిని పెళ్లి చేసుకొని సొమ్ము కాజేసిన ఓ కిలాడీ లేడీ చివరకు కటకటాలపాలైంది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తిరుపూరు జిల్లా తారాపురం సమీపంలోని గోప్పనగౌండం పాళయంకు చెందిన సెల్వకుమార్ (32), పవిత్ర (25) అనే యువతిని ప్రేమించి గత సంవత్సరం వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత కొంత కాలానికే సెల్వకుమార్ వద్ద ఉన్న బంగారు నగలు, నగదును దోచుకుని పవిత్ర పారిపోయింది. దీనిపై అతడు తారాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు.. విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిసొచ్చాయి. పోలీసులు పవిత్రను వెతుకుతున్న సమయంలో ఆమె మొదటి భర్త కర్ణన్ (35)తో ఉడుమలై ప్రాంతంలో అజ్ఞాతంలో తల దాచుకున్నట్లు తెలిసింది.
ఆమె అసలు పేరు మారియమ్మాళ్ అని, మాలతి, పవిత్ర, ఏంజలిన్ అనే పలుపేర్లతో ఏడుగురిని మోసం చేసి వివాహం చేసుకున్నానని, మొదటి భర్త కర్ణన్, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కూతురు దొరకని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారితో కొన్ని నెలలు కాపురం చేసి దొరికిన నగలు, డబ్బులతో ఉడాయించడం ఆమె వృత్తిగా పెట్టుకుందని విచారణలో తెలిపింది. దీంతో ఉడుమలై బస్టాండులో నిలబడి ఉన్న పవిత్ర అలియాస్ మారియమ్మాళ్‌ను ఆమె మొదటి భర్త కర్ణన్‌ను తారాపురం పోలీసులు అరెస్టు చేశారు.
ఈమె తిరువూర్ జిల్లా పల్లడం అరిమాలినగర్‌కు చెందిన సెల్వరాజ్. పళని అమ్మాల్ దంపతులకు ఒకే కూతురు. మొదటి భర్త కర్ణన్‌తో తన పేరు మాలతి అని చెప్పి ఏడో భర్త సెల్వకుమార్‌తో పవిత్ర అని చెప్పి వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి కొడుకుల వేటకు తారాపురం, ఉడుమలై, పళని, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన పెళ్లి బ్రోకర్లు తొమ్మిదిమంది బ్రోకర్లు సహాయం చేశారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications