Cheating: లడ్డూ సైజులో. బుట్టబొమ్మ కాదు గుండ్రాయి బొమ్మ, మనోడికి గుడ్డు పెట్టించింది, పెళ్లి పేరుతో !
చెన్నై/దిండుగల్/పుదుచ్చేరి: వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు చూస్తున్న అమ్మాయిలు నచ్చకపోవడంతో ఆ యువకుడి పెళ్లి త్వరగా జరగకుండా వాయిదా పడుతూ వచ్చింది. మంచి అమ్మాయి చిక్కాలంటే తనకు మ్యాట్రిమోనీ డీలింగ్ కరెక్టు అని అనుకున్న ఆ యువకుడు గౌరీ మ్యాట్రిమోనీ సంస్థ నిర్వహకులను సంప్రధించాడు. పుదుచ్చేరిలో పాలరాతి రంగులో తెల్లగా మిలమిలలాడిపోతున్న గుండ్రాయి లాంటి మహిళ ఫోటోలు అతనికి చిక్కాయి. పాలరాతి రంగులో గుండ్రాయి లాగా ఉన్న యువతి పెళ్లికి సిద్దంగా ఉందని ఆ వ్యాపారికి తెలిసింది. అంతే బంధువులను వెంటపెట్టుకుని ఎగేసుకుంటూ ఆమె ఇంటి ముందు వాలిపోయాడు. అక్కడ జరిగిన హైడ్రామాతో వెంటనే పాలరాతి బొమ్మ, ఆ వ్యాపారి నిశ్చితార్థం చేసుకోవాలసి వచ్చింది. పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికి నిశ్చితార్థం సందర్బంగా పెద్ద బంగారు గొలుసు, పట్టు వస్త్రాలు. చేతి ఖర్చుల కోసం రూ. 25 వేలు ఇచ్చాడు. అక్కడ సీన్ కట్ చేసి ఆరు నెలల వరకు గుండ్రాయి బొమ్మ కనపడలేదు. సినిమా స్క్రిప్టు టైపులో అనేక స్కెచ్ లు వేసిన వ్యాపారి తనతో నిశ్చితార్థం చేసుకున్న పాలరాతి బొమ్మను పట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు లాక్కొన్ని వెళ్లడంతో కథ రసవత్తరంగా మారింది.

వ్యాపారి పెళ్లిగోల
తమిళనాడులోని దిండుగల్ లోని కోవిల్ స్ట్రీట్ లో సెల్లాపాండి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న సెల్లాంపాడి యువకుడు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు చూస్తున్న అమ్మాయిలు నచ్చకపోవడంతో సెల్లాపాండి పెళ్లి త్వరగా జరగకుండా వాయిదా పడుతూ వచ్చింది.

పాలరాతి రంగులో కత్తి లాంటి ఫిగర్
మంచి అమ్మాయి చిక్కాలంటే తనకు మ్యాట్రిమోనీ డీలింగ్ కరెక్టు అని సెల్లాపాండి అనుకున్నాడు. వెంటనే తమిళనాడులోని గౌరీ మ్యాట్రిమోనీ సంస్థ నిర్వహకులను సెల్లాపాండి సంప్రధించాడు. పుదుచ్చేరిలో పాలరాతి రంగులో తెల్లగా మిలమిలలాడిపోతున్న గుండ్రాయి లాంటి సోషిక అనే మహిళ ఫోటోలు సెల్లాపాండి చూశాడు.

ఎగరేసుకుంటూ వెళ్లిపోయాడు
పుదుచ్చేరిలో నివాసం ఉంటున్న సోషిక ఫోటోలు చూసిన సెల్లాపాండి తట్టుకోలేకపోయాడు. తెల్లగా పిటపిటలాడిపోయే రంగులో నున్నగా, గుండ్రాయి లాగా ఉన్న సోషికను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సెల్లాపాండి అనుకున్నాడు. పాలరాతి రంగులో గుండ్రాయి లాగా ఉన్న సోషిక కూడా మంచి యువకుడిని పెళ్లికి సిద్దంగా ఉందని వ్యాపారి సెల్లాపాండికి మ్యాట్రీమోనీ నిర్వహకులు చెప్పారు. అంతే వ్యాపారి సెల్లాపాండి బంధువులను వెంటపెట్టుకుని ఎగేసుకుంటూ ఆమె ఇంటి ముందు వాలిపోయాడు.

సినిమా స్టోరీ చెప్పిన కిలాడీ లేడి
సెల్లాపాండి, సోషికకు పెళ్లి చూపులు జరిగాయి. తన తల్లిదండ్రులు 10 సంవత్సరాల క్రితం సునామిలో కొట్టుకుపోయి చనిపోయారని, తనకు ఎవ్వరూ లేరని, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని సోషిక పట్టుబట్టింది. అయితే కుటుంబ సభ్యులకు తెలీకుండా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని సెల్లాపాండి సోషికాకు చెప్పాడు.

హైడ్రామాతో స్పాట్ లో నిశ్చితార్థం
సోషిక ఇంటి దగ్గర జరిగిన హైడ్రామా జరిగింది. 2021 మార్చి 11వ తేదీన వెంటనే పాలరాతి బొమ్మను వ్యాపారి సెల్లాపాండి నిశ్చితార్థం చేసుకోవాలసి వచ్చింది. పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి సోషికకు నిశ్చితార్థం సందర్బంగా పెళ్లి కొడుకు సెల్లాపాండి 14 పౌండ్ల బంగారు గొలుసు, పట్టు చీరలు, చేతి ఖర్చుల కోసం రూ. 25, 000 ఇచ్చాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తానని సోషికకు చెప్పిన సెల్లాపాండి పుదుచ్చేరి నుంచి దిండుగల్ వెళ్లిపోయాడు.

మొబైల్ స్వీచ్ ఆఫ్..... కిలాడీ లేడీ ఎస్కేప్
అక్కడ సీన్ కట్ చేసి సీన్ మారిపోయింది. నిశ్చితార్థం చేసుకున్న సోషిక మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మొబైల్ నెంబర్ మార్చేసి మాయం అయిపోయింది. ఆరు నెలలు అయినా సోషిక టచ్ లోకి రాకపోవడంతో వ్యాపారి సెల్లాపాండికి అనుమానం వచ్చింది. బంధువులను వెంటపెట్టుకుని పుద్దుచ్చేరి లోని సోషిక ఇంటి దగ్గరకు వెళ్లాడు. సోషిక నివాసం ఉంటున్న ఇంటికి టూ లెట్ బోర్డు తగిలించి ఉండటంతో వ్యాపారి సెల్లాపాండి బిత్తరపోయాడు.

పక్కా స్కెచ్ వేసిన వ్యాపారి
చాలాకాలంగా సోషిక కోసం గాలించిన సెల్లాపాండి చివరికి ఆమె కజిన్ బ్రదర్ ను సంప్రధించాడు. కజిన్ బ్రదర్ తో స్కెచ్ వేసిన సెల్లాపాండి ఆమెను దిండుగల్ కు రావాలని చెప్పించాడు. పుదుచ్చేరి పాలరాతి గుండ్రాయి సోషిక కారులో దిండుగల్ రావడంతో ఆమెను పక్కాప్తాన్ తో సెల్లాపాండి ఫాలో అయ్యాడు. గుండ్రాయి బొమ్మ సోషికను సినిమా స్కెచ్ సెల్లాపాండి, అతని ఫ్రెండ్స్ పట్టుకున్నారు.

ఎంత చెప్పినా వినలేదు
సోషిక ఏదేదో చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. నిశ్చితార్థం సందర్బంగా ఇచ్చిన బంగారు గొలుసు, పట్టు చీరలు, రూ. 25,000 తిరిగి ఇచ్చేస్తానని సోషిక వ్యాపారి సెల్లాపాండికి చెప్పింది. అయితే పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేసిన సోషికను లాక్కొని వెళ్లిన సెల్లాపాండి ఆమెను పోలీసులకు అప్పగించారు. తాను తప్పు చేశానని, తనను వదిలేస్తే బంగారు నగలు, డబ్బులు ఇచ్చేస్తాని సోషిక వ్యాపారి సెల్లాపాండి కాళ్లు పట్టుకున్నా అతను మాత్రం మాట వినలేదు.

కత్తిలాంటి కిలాడీ లేడీ అరెస్టు
పోలీసులు రాజీ చెయ్యడానికి ప్రయత్నించినా సెల్లాపాండి మాత్రం మాట వినలేదు. తనను మోసం చేసిన సోషిక మీద చీటింగ్ కేసు పెట్టాలని సెల్లాపాండి పట్టుబట్టారు. చేసేది లేక పోలీసులు సోషిక మీద చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సోషిక గతంలో ఇంకా ఎవరినైనా పెళ్లి పేరుతో ఇంకా ఇలాగే ఎవరినైనా మోసం చేసిందా అని ఆరా తీస్తున్నామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద గుండ్రాయి లాంటి కత్తిలాంటి ఫిగర్ సోషిక పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ అయ్యింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications