ముంబై ఇండియన్స్ కొంప ముంచిన ఛీర్ గల్స్.!ఎనిమిది మ్యాచ్ ల్లో ఓటమికి కారణం వాళ్లేనట.!!

హైదరాబాద్ : పాటలో రాగం ఉండాలి.. యువత పార్టీలో మత్తు ఉండాలి.. బైక్ రైడింగ్ లో వేగం ఉండాలి..ప్రియురాలి చూపులో మైకం ఉండాలి.. అదే క్రికెట్ ఆటలో ఐతే కిక్కు ఉండాలి. ఆ కిక్కు ఉంటేనే స్టేడియం బౌండ్రీ లైన్లో ఫోర్లు, స్టేడియం బైట సిక్సర్లు పడుతుంటాయి. అప్పుడే ప్రేక్షకుల్లో కేరింతలు, చప్పట్లు కట్టలు తెంచుకుంటాయి. వీటన్నిటికి ఛీర్ గల్స్ నృత్య విన్యాసాలు తోడైతే ఆ కిక్కు వేరే లెవల్ లో ఉంటుంది. బ్యాట్స్ మన్ కొట్టే ప్రతి ఫోర్ కి, ప్రతి సిక్సర్ కి ఛీర్ గల్స్ వేసే లయబద్దమైన స్టెప్పులు ప్రేక్షకులతో పాటు బాట్స్ మెన్ లకు ఉత్తేజపూరితంగా ఉంటుంది.

 ఉత్సాహంగా సాగాల్సిన ఐపిఎల్ లో నిరుత్సాహం.. అంతా వాళ్లే చేసారట

ఉత్సాహంగా సాగాల్సిన ఐపిఎల్ లో నిరుత్సాహం.. అంతా వాళ్లే చేసారట

ఫోర్లు, సిక్సర్లతో ఛీర్ గల్స్ లో ఉత్సాహాన్ని నింపితే అదే ఛీర్ గల్స్ నాట్యభంగిమలతో మైదానంలోని క్రీడాకారులను మరింత ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఐపీఎల్2022 సీజన్ లో ఛీర్ గల్స్ విన్యాసాలు లేక హేమా హేమీల్లాంటి జట్లు ఇంటిముఖం పట్టడం విచారకరం. అంతే కాకుండా 2022సీజన్ లో ఛీర్ గల్స్ మైదనాంలో లేక పోడంతో ముంబాయి ఇండియా జట్టు తీవ్ర నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. అందుకే ఆ జట్టు ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్ లను చేజార్చుకుంది.

 ఛీర్ గల్స్ లేకపోవడంతో ముంబాయి జట్టు నిరాశ.. అందుకే వరుస ఓటములంటున్న క్రీడా విశ్లేషకులు

ఛీర్ గల్స్ లేకపోవడంతో ముంబాయి జట్టు నిరాశ.. అందుకే వరుస ఓటములంటున్న క్రీడా విశ్లేషకులు

ఛీర్ గల్స్ లేకపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఎంత నిరాశ, నిస్ప్రుహలకు గురైందో దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంతే స్థాయిలో విచారణ వ్యక్తం చేస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు జట్లు కూడా పైకి చెప్పుకోలేక పోయినా లోలోపల మాత్రం ఛీర్ గల్స్ అంశంలో మదనపుడుతున్నట్టు తెలుస్తోంది.అందుకే ఏకాగ్రతకు భంగం కలిగి, మంచి ఉత్సాహం, ఊపు లేక ఈ దిగ్గజ జట్లన్నీ కొత్త కొత్త జట్లతో ఓటమి పాలవుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి.

 ఛీర్ గల్స్ విన్యాసాలు లేవు.. ముంబాయి బ్యాట్స్ మెన్ మెరుపులు లేవు

ఛీర్ గల్స్ విన్యాసాలు లేవు.. ముంబాయి బ్యాట్స్ మెన్ మెరుపులు లేవు

ఈ ఐదు జట్ల యాజమాన్యాలు అసలు విషయం తెలుసుకోకుండా బ్యాట్స్ మెన్ ల మీద, బౌలర్ల మీద ఒత్తిడి పెంచితే ఆటగాళ్లు మరింత నైరాశ్యంలో వెళ్లిపోతారు తప్పితే మైదానంలో ఆశించిన ఆటను మాత్రం ఆడలేరు. ఇప్పటికైనా విదేశాల్లో ఉన్న ఛీర్ గల్స్ ని వెంటనే పిలిపించి మైదానంలో ప్రవేశపెడితే మిగతా మ్యాచ్ లు గెలిచేందుకు ఆటగాళ్లు శ్రమిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, చెన్నై, కోల్ కతా జట్లు ఈ ఛీర్ గల్స్ లేక పోడంతో ఒకరకమైన బెంగపెట్టుకుని మైదానంలోకి వచ్చి ఆడుతున్నట్టు తెలుస్తోంది.

 ఛీర్ గల్స్ ని ప్రవేశ పెట్టండి.. ముంబై ఇండియన్స్ సత్తా చూడండి..

ఛీర్ గల్స్ ని ప్రవేశ పెట్టండి.. ముంబై ఇండియన్స్ సత్తా చూడండి..


క్రీడాకారుల మనోభావాలను అర్థం చేసుకుని జట్ల యాజమాన్యాలు చొరవతీసుకుని ఛీర్ గల్స్ ని రంగప్రవేశం చేయిస్తే మిగితా మ్యాచ్ ల్లో విజయం తధ్యమనే చర్చ కూడా జరుగుతోంది. మైదానంలో ఛీర్ గల్స్ విన్యాసాలు ఒక్కసారి మొదలైతే మన బ్యాట్స్ మెన్లు వందసునామీల బలంతో మైదానంలో దమ్ములేపుతారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఓటమి పాలవుతున్న జట్లు చీర్ గల్స్ ఎంట్రీతో తప్పక విజయాల బాట పడుతాయనే చర్చ కూడా సాగతోంది. సో బెస్ట్ ఆఫ్ లక్ ముంబై ఇండియన్స్.!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+