పాకిస్థాన్‌లో ఎండిపోయిన చీనాబ్ నది.. 80 శాతం జనాభాకు నీళ్లు లేవు.. ఎందుకురా పడుకున్న సింహాన్ని లేపారు?
పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్ బిక్కుబిక్కు మంటూ వణుకుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల మాత్రం భయాందోళనలో ఉంది. భారత్ పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ దాడి చేస్తుందోనని కంటిమీద కునుకు లేకుండా ఆ దేశం భయాన్ని అనుభవిస్తోంది. ఓవైపు భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇప్పటికే పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరింది.
అయితే భారత్ సింధూ నదీ జలాలు పాకిస్థాన్ లోని చీనాబ్ నది ఎండిపోయింది. పాకిస్తాన్‌లో 80 శాతం జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి "సింధు జలాల ఒప్పందం"ను రద్దు చేసుకుంది. దీంతో సింధూ నదికి ఉపనది అయిన చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. తాజాగా రిలీజైన శాటిలైట్ చిత్రాలు అద్దం పడుతున్నాయి. దేశంలోని 80 శాతం మందికి ఈ నది నీరే ఆధారం. దీంతో అతి త్వరలోనే నీటి సంక్షోభం ఆ దేశాన్ని చుట్టుముట్టనుంది. భారత్ తో యుద్ధం సంగతి తర్వాత.. ముందు మంచినీళ్ల పరిస్థితి ఏంటో అని అక్కడి ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.

అయితే పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కొందరు మాత్రం సింధు కు చెందిన కొందరు నేతలు మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఈ నిర్ణయంపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. "సింధు నది పాకిస్థాన్ లో భాగమని గతంలో భారత్ అంగీకరించింది. ఇప్పుడు ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధు నది మాది, మాకే సొంతం. ఈ నదిలో నీరు ప్రవహిస్తుంది, లేదంటే భారతీయుల రక్తమైనా ప్రవహిస్తుంది" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
కఠినమైన చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం. సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పాకిస్థాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
Satellite image shows Indus Waters Treaty abeyance at work; Chenab River near Sialkot runs dry now-#WATCH@YawarShafi4 joins @ShreyaOpines with more details. pic.twitter.com/OVmjscksIA
— TIMES NOW (@TimesNow) April 30, 2025
ఈ సమావేశం అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోనూ ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఉగ్రవాద అంతానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని మోహన్ భగవత్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు పహల్గాం ఉగ్రదాడి NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా లభించిన రెండు కీలక వీడియోల ఆధారంగా ఉగ్రదాడిని ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. జిప్ లైన్ ఆపరేర్లను విచారణ చేస్తున్న ఎన్‌ఐఏ.. బైరసన్ లోయలో ఉగ్రవాదులు వాడిన 40 క్యాట్రిడ్జ్‌లను గుర్తించింది.












Click it and Unblock the Notifications