94 ఏళ్ల తల్లి, 70 ఏళ్ల కూతురు కరోనాను జయించారు - ఐదు రోజుల్లోనే భేషుగ్గా ఇంటికి - వైరల్ వీడియో
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కొవిడ్ మరణాల రేటు చాలా తక్కువని తెలిసిందే. మహమ్మారి బారినపడి ఇప్పటిదాకా చనిపోయినవాళ్లలో 70 శాతానికిపైగా 60ఏళ్లు పైబడినవాళ్లే ఉన్నారు. అలాంటిది, ఈ తల్లీకూతుళ్లు కరోనాను ఐదు రోజుల్లోనే కరోనాను జయించిన తీరు అందరిలో ధైర్యం నింపుతున్నది.
కేసులు, మరణాల సంఖ్య పరంగా దేశంలో కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో తమిళనాడు రెండో స్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. రాజధాని చెన్నై సిటీకి చెందిన 94 ఏళ్ల మహిళ, ఆమె కూతురు(70 ఏళ్లు) గత వారం ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే ఆ ఇద్దరూ ఆరుంబాకంలోని ప్రైమ్ ఇండియా ఆస్పత్రిలో చేరారు. పెద్ద వయసున్న మిగతా పేషెంట్లకు భిన్నంగా ఈ తల్లీకూతుళ్లు వేగంగా కోలుకోవడం విశేషం.

ఆస్పత్రిలో చేరేనాటికి తల్లీకూతుళ్లకు జ్వరం, ఒళ్లు నొప్పుల సమస్యలు ఉన్నాయని, ఆక్సిజన్ థెరపీ ద్వారా చికిత్స అందించగా, అద్భుతమైన రీతిలో ఐదు రోజుల్లోనే కోలుకున్నారని, ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఒళ్లు నొప్పులు, జ్వరం పూర్తిగా తగ్గిపోయాయని, నెగటివ్ ఫలితాలు రావడంతో ఇద్దరినీ ఒకేరోజు డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్లు మీడియాకు తెలిపారు.
కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,958 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 3.97లక్షలకు పెరిగింది. తమిళనాడులో ఇప్పటిదాకా కరోనా వల్ల 6,839మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 3.38 లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 52,362గా ఉంది.












Click it and Unblock the Notifications