పని ఒత్తిడి తట్టుకోలేక ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్య
చెన్నై: తీవ్రమైన పని ఒత్తిడి తట్టుకోలేక ఎయిర్ఇండియాలో పని చేస్తున్న ఎయిర్ హోస్టెస్ మన్‌ప్రీత్ పాల్(32) తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ఇండియాలో టెక్నీషియన్ అనూప్ నాయర్(35)ను పంజాబ్‌కు చెందిన మన్ ప్రీత్ పాల్ 2012లో వివాహం చేసుకుంది.
వీరికి హాసిని అనే రెండేళ్ల కూతురు కూడా ఉంది. గత ఆదివారం అనూప్ నాయర్ డ్యూటీకి వెళ్లగా.. మన్ ప్రీత్ మస్కట్ విమానంలో డ్యూటీ ఉండటంతో కుమార్తెతో ఇంట్లోనే ఉంది. కాగా, సాయంత్రం భర్తకు ఫోన్ చేసి కుమార్తెను అత్తగారింట వదిలి పెట్టానని, డ్యూటీ నుంచి వస్తూ తీసుకెళ్లాలని చెప్పింది.

దీంతో అనూప్ కుమార్తెను వెంటబెట్టుకుని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిందేమోనని భావించాడు. పడకగదికి తలుపులు లోపల గడియవేసి ఉండటం గమనించి, ఇరుగుపొరుగుతో కలిసి తలుపులు పగలగొట్టగా మన్ ప్రీత్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పని ఒత్తిడి వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. తమ కూతురు, అల్లుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పెళ్లైన తర్వాత ఒక్కరోజు కూడా వారు గొడవపడలేదని చెప్పారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications