షాక్: జయలలితకు చికిత్స, సీసీటీవీ క్లిప్పింగ్స్ లేవు, అపోలో క్లారిటీ, వీవీఐపీలు: నిపుణులు!
Recommended Video

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న విచారణ కమిషన్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. జయలలితకు చికిత్స చేసిన సమయంలో రికార్డు అయిన సీసీటీవీ వీడియో క్లిప్పింగ్స్ లేవని, అవి చెరిగిపోయాయి అంటూ అపోలో ఆసుప్రతి వర్గాలు మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు చెప్పాయి.
జయలలితకు చికిత్స చేసిన సమయంలో రికార్డు అయిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ మా దగ్గర లేవని అపోలో ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో అమ్మ అభిమానులు షాక్ కు గురైనారు. సీసీకెమెరాల వీడియో క్లిప్పింగ్ రికవరి చెయ్యడానికి సాధ్యం అవుతుందా అంటూ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిపుణులను సంప్రధిస్తున్నది.

వంద మంది విచారణ
జయలలిత అనుమానాస్పద మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ దాదాపు వంద మందికి పైగా హాజరై వివరణ ఇచ్చారు. జయలలితకు చికిత్స అందించిన అపోలో, ఎయిమ్స్ వైద్యులు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

వీడియోలు ఇవ్వండి
జయలలితకు చికిత్స చేసిన సమయంలో రికార్డు అయిన సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ ఇవ్వాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సూచించింది. ఇంత కాలం సీసీ కెమెరాల వీడియో క్లిప్పింగ్స్ ఇస్తారని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఎదురు చూసింది.

వీవీఐపీల చికిత్స
వీవీఐపీలు చికిత్స పొందే గదుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చెయ్యమని అపోలో ఆసుపత్రి న్యాయవాది మైనా బాష విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో జయలలితకు చికిత్స అందించిన క్లిప్పింగ్స్ రికార్డు కాలేదని న్యాయవాది మైనా బాష జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు చెప్పారు.

నెల రోజులు ఉంటాయి!
అపోలో ఆసుపత్రిలో వీవీఐపీలు చికిత్స పొందే గదుల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చెయ్యలేదని అపోలో ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. సీసీకెమెరాల్లో రికార్డు అయిన క్లిప్పింగ్స్ నెల రోజులకు మించి ఉండవని, కొత్తగా దృశ్యాలు రికార్డు అయిన వెంటనే పాత దృశ్యాలు చెరిగిపోతాయని అపోలో ఆసుపత్రి వర్గాలు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.

నిపుణుల బృందం
అపోలో ఆసుపత్రి వివరణతో విచారణ కమిషన్ ఆలోచనలో పడింది. అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల సర్వర్లు పరిశీలించి పాత క్లిప్పింగ్స్ సేకరించడం సాధ్యం అవుతుందా ? లేదా ? అని పరిశీలించాడానికి నిపుణుల బృందాన్ని పంపించాలని జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications