14 మంది మృతి.. పలు రైళ్లు రద్దు, తమిళనాడులో బీతావాహ పరిస్థితి

తుపాన్ తీరం దాటింది. దీంతో ఏపీతోపాటు తమిళనాడులో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో.. వరద ప్రవాహం వస్తోంది. దీంతో డ్యాంలలో ఉన్న మిగులు జలాలను కిందికి వదులుతున్నారు. వర్షం ప్రభావంతో తమిళనాడులో 14 మంది చనిపోయారు. వర్షం తీసుకొచ్చిన వరదనీటితో చెన్నై జనం ఇబ్బంది పడుతున్నారు. దీంతో 75 వేల మంది పోలీసులు, అధికారులు సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

వరదనీటిని బయటకు పంపించేందుకు అధికారులు ఇబ్బందులు మాములుగా లేదు. రొబొటిక్ ఎక్సవేటర్ వాడుతున్నారు. అంతేకాదు వరదనీరు ప్రభుత్వ ఆసుప్రతుల్లోకి కూడా వచ్చింది. కేకే నగర్, క్రొమిపేట్ వద్ద నీరు వచ్చి చేరింది. డెలుగు, రామ్ నగర్, మడిపక్కం వద్ద పార్కింగ్ చేసిన కార్ల వద్దకు నీరు చేరింది. వరదతో ఇవాళ కూడా విమాన రాకపోకలను నిలిపివేశారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు సేవలను సస్పెండ్ చేశారు.

మడిచూర్, పెరంగలాథూర్, నందివరం, గుడువంచెరీలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో విద్యుత్ నిలిపివేశారు. వర్ష ప్రభావంపై మంత్రులతో సీఎం స్టాలిన్ చర్చించారు. సీఎస్ వీ ఆరయ్ పరిస్థితిని వివరించారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్టాలిన్ స్పష్టంచేశారు. ఆహారం, మందులు, క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. పంట నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

 Chennai battles rain fury; 14 dead so far in TN

ఆరుగురు మంత్రులతో మినిస్టిరియల్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. కోఆపరేటివ్ మంత్రి పెరియస్వామి నేతృత్వంలో కమిటీ.. పంట నష్టం అంచనా వేస్తోంది. కావేరి డెల్టాలో పంటను పరిశీలించి.. నివేదిక అందజేస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం స్టాలిన్ వివరించారు. ఇటు వర్షాల వల్ల కొన్ని రైళ్ల సస్పెన్షన్ కొనసాగుతోంది.

Recommended Video

    Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

    పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తోన్న వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరి పంట చేతికి వచ్చింది. వర్షాలు పడటంతో.. నీటితో తడిగా ఉంటుంది. దీంతో మిషన్ల ద్వారా కోత మరింత కష్టం అవుతుంది. వరుణ దేవ తమను కరుణించు అని అన్నదాతలు వేడుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+