శిథిలాలు: 39 గంటల తర్వాత ప్రాణాలతో ఆంధ్ర మహిళ
చెన్నై: భవనం కూలిన 39 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కూలిన భవనం శిథిలాల నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరిలో ఓ మహిళ ఉంది.
చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇంకా 40 మందిదాకా భవనం శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. శిథిలాలను తొలగించి, మరింత మందిని కాపాడడానికి రెండు మూడు రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. శనివారంనాడు సాయంత్రం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
భవనం కూలినప్పుడు అక్కడ 72 మంది కూలీలు పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారంనాడు చెప్పారు. ఇప్పటి వరకు 22 మందిని రక్షించారు. 17 మంది మరణించారు. శిథిలాల నుంచి సోమవారం ప్రాణాలతో బయటపడిన మహిళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల నీనామాల్‌గా గుర్తించారు. ఈ భవనం నిర్మాణంలో పనిచేస్తున్న ఎక్కువ మంది కూలీలు ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతానికి చెందినవారు.

పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు భవనం ప్రమోటర్స్‌తో పాటు ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు, నాణ్యతభద్రతలపై రాజీ పడినట్లు వారిపై ఆరోపణలున్నాయి. నిర్మాణపరమైన లోపాలు చాలా ఉన్నట్లు, ధ్రువీకృత ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు లేరని అనిపిస్తోందని జయలలిత అన్నారు.
చంద్రబాబు పరిశీలన
భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ప్రమాద బాధితులను పరామర్శించిన బాబు ఈ ఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక కూలీలకు సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. శిథిలాలు తొలగించడానికి ఐదారు రోజులు పట్టవచ్చునని అంటన్నట్లు ఆయన తెలిపారు. వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications