చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూలిన భవనం: మరో ఇద్దరు ఆంధ్ర కూలీలు భద్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో 11 అంతస్థుల భవనం కూలిన సంఘటనలో మరో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారంనాడు నలుగురిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారున్నారు.

మహేష్ (23), అనుసూయ (30) అనే ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు సురక్షితంగా బయటపడ్డారు. మరో వయ్క్తి తమిళనాడులోని మదురై జిల్లాకు చెందిన 27 ఏళ్ల సెంథిల్. నాలుగో వ్యక్తి ఆస్పత్రికి తరలించిన వెంటనే మరణించింది. 60 గంటల తర్వాత బయట పడిన ఆ 50 ఏళ్ల మహిళ ఆస్పత్రికి తరలించిన వెంటనే మరణించింది.

Chennai Building Collapse: Woman Rescued After 60 Hours Dies in Hospital

ఇప్పటి వరకు 26 మందిని సురక్షితంగా శిథిలాల నుంచి బయటకు తీసినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య 28కి చేరుకుంది. ఇంకా 18 మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కూలీల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తర భారతదేశానికి చెందినవారు.

భవన నిర్మాణంలో 72 మంది కూలీలు పనిచేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెప్పారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల భవనం శనివారం సాయంత్రం కూప్పకూలింది.

English summary
Four people were rescued today after 60 hours under the debris of an 11-storey building in Chennai, Tamil Nadu, which collapsed on Saturday. One of them, a 50-year-old woman, died soon after in hospital, taking the number of dead to 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X