పన్నీర్ సెల్వంకు షాక్: శేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి తలనొప్పిగా తయారైనాడు. బుధవారం శేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. చెన్నైలో శేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.

తమిళనాడులో ఇసుక క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తూ సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించుకుండా కాలం గడిపిన శేఖర్ రెడ్డి ఇటీవల ఐటీ అధికారుల వలలో పడ్డాడు. ఆయన ఇంటిలో 170 కోట్ల రూపాయల నగదు, రూ. 130 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి నుంచి ఐటీ అధికారులు శేఖర్ రెడ్డిని, ఆయన బంధువులు ప్రేమ్ రెడ్డి, కిరణ్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తున్నారు. మంగళవారం చెన్నై చేరుకున్న సీబీఐ ప్రత్యేక బృందం అధికారులు శేఖర్ రెడ్డిని విచారించి వివరాలు సేకరించారు.

 Chennai businessman Sekar Reddy arrested by CBI

బుధవారం వేకువ జామున తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు కు సమన్లు జారీ చేసిన ఐటీ అధికారులు ఒక్క నిమిషయం కూడా సమయం ఇవ్వకుండా ఆయన ఇంటిలో సోదాలు చేశారు.

మద్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ సెక్రటేరియట్ లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా చెన్నై నగరంలోని నాలుగు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం పారామిలటరీ బలగాలను మొహరించింది.

 Chennai businessman Sekar Reddy arrested by CBI

ఈతతంగం జరుగుతున్న సమయంలోనే సీబీఐ అధికారులు శేఖర్ రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. శేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చెయ్యడంతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోయారు. శేఖర్ రెడ్డి అన్నాడీఎంకే నాయకులతో సన్నిహితంగా ఉంటున్నాడు.

ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు శేఖర్ రెడ్డి సన్నిహితుడు అనే ముద్ర ఉంది. శేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చెయ్యడంతో పన్నీర్ సెల్వం అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మా నాయకుడు పన్నీర్ సెల్వంకు శేఖర్ రెడ్డి పెద్ద తలనొప్పిగా తయారైనాడని అంటున్నారు.

మొత్తం మీద శేఖర్ రెడ్డి కారణంగా తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు సీఎం పన్నీర్ సెల్వం సీటుకు శేఖర్ రెడ్డి ఎసరు పెడుతున్నారని చెబుతున్నారు. శేఖర్ రెడ్డిని నమ్మినందుకు ఆయన అందరిని నట్టేట ముంచేస్తున్నాడని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+