పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్
మరో రైలు ప్రమాదం సంభవించింది. చెన్నై సెంట్రల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం మూడు బోగీలు నేలలోకి దిగాయి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది, రెస్యూ బృందాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్క ఉదుటన కిందికి దిగిపోయారు.
జాజ్ పూర్ జిల్లా జాఖాపుర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై సెంట్రల్-న్యూ జల్ పాయ్ గురికి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అది. ఈ దుర్ఘటనతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరికీ ప్రాణనష్టం గానీ గాయాలు గానీ సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పిన సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన సహాయక బృందాలను సంఘటనా స్థలానికి పంపారు. రెస్క్యూ సిబ్బంది సమాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.

రైలు చక్రాలు ట్రాక్ మధ్యలోకి వచ్చేశాయంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రైలులో ప్రయాణిస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నారని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో బోగీలకు పెద్దగా నష్టం జరగలేదని, ప్రయాణికులకు కూడా ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రైల్వే అధికారులు కార్యకలాపాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోన్నారు.
ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లను సమీప స్టేషన్లల్లో నిలిపివేశారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ట్రాక్‌లను క్లియర్ చేసి, రైళ్ల రాకపోకలను శరవేగంగా పునరుద్ధరించడానికి ఇంజినీరింగ్ బృందాలను మోహరించారు. ఈ దుర్ఘటనకు దారితీసిన కారణం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
పట్టాలు ఎందుకు తప్పాయనే దానిపై అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. దర్యాప్తు చేస్తోన్నామని, దీనికి గల కారణాలను అన్వేషిస్తోన్నామని పేర్కొన్నారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అనంతరం సంఘటనపై సమగ్ర విచారణ మొదలయ్యే అవకాశం ఉంది. కిందటి నెల 27వ తేదీన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన రైల్ యార్డులో రాత్రి 11:35 గంటలకు, గూడ్స్ రైలు జగదల్‌పూర్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరిన సమయంలో చోటు చేసుకుంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications