చెన్నై-కోవై విమానంలో అరుదైన దృశ్యం-కుటుంబంతో తొలిసారి ప్రయాణం-పైలట్ భావోద్వేగం..!
అది చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లేందుకు బయలుదేరుతున్న విమానం. ప్రయాణికులు విమానంలోకి ఎక్కి తమ సీట్లలో కూర్చోగానే పైలట్ వచ్చి ఓ ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ప్రయాణికులంతా తమ ప్రయాణంలో ఎలా ఉండాలో పైలట్ చెప్పబోతున్నాడని భావించారు. కానీ అదే విమానంలో తన కుటుంబంతో కలిసి తొలిసారి ప్రయాణిస్తున్నాడని, ఆ అనుభం ఎలా ఉంటుందో తమతో పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అస్సలు ఊహించలేదు. కానీ అదే జరిగింది.
చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్లే విమానం నడిపే పైలట్ తొలిసారి తన కుటుంబాన్ని తన విమానంలో తీసుకెళ్లాడు. అందులో పైలట్ ప్రదీప్ తల్లి, తాత, అమ్మమ్మ కూడా ఉన్నారు. తన చిన్నతనంలో స్కూటర్ పై ఎక్కించుకుని తిప్పిన తన తాతను తాను పైలట్ అయ్యాక నడిపే విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్లాలని కోరుకున్నాడు. అనుకున్న సమయం వచ్చేసింది. తాతతో పాటు ఇతర కుటుంబ సభ్యుల్ని విమానంలో టికెట్లు తీసుకుని ఎక్కించాడు..

మొదటి సారి పేరెంట్స్‌ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్..ఆనందంతో తల్లి కంటతడి
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024
చెన్నై- కోయంబత్తూరు విమానంలో ప్రదీప్ అనే పైలట్ తన తల్లి, బామ్మ, తాతను మొదటి సారి విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు.
మావాళ్లు నాతో మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. తాత చిన్నప్పుడు స్కూటర్ పై నన్ను… pic.twitter.com/tmjeqKHzA8
వారు విమానంలోకి ఎక్కి కూర్చున్నాక ప్రయాణికులను ఉద్దేశించి మైక్ లో మాట్లాడటం మొదలుపెట్టాడు. తన కుటుంబాన్ని తొలిసారి తాను నడుపుతున్న విమానంలో తీసుకెళ్తున్నానని, తన తాత, ఇతర కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారని చెబుతూ వారిని పరిచయం చేశాడు. దీంతో వారు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆనంద భాష్పాలు ఉబికి వస్తుంటే ఆపుకుంటూ పైలట్ చెప్పిందంతా విన్నారు. ఓ దశలో మాటలు కూడా రాక ఇబ్బందిపడ్డారు. దీంతో ఇతర ప్రయాణికులు కూడా వారిని అభినందించారు.












Click it and Unblock the Notifications