జైల్లో శశికళకు వందనాలు: తమిళనాడు సీఎంతో సహ మంత్రులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!

చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడిన మంత్రులకు చుక్కెదురైయ్యింది.

న్యాయస్థానం శశికళ నేరం చేశారని గుర్తించి శిక్ష అమలు చేసిందని, అలాంటి శశికళను జైల్లో మీరు ఎందుకు కలిశారు ? అని సమాధానం చెప్పాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మద్రాసు హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ గురువారం నోటీసులు జారీ చేసింది.

Chennai HC Madurai branch issues notice TN CM his 4 ministers

తమిళనాడులో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను ఎందుకు కలిశారు ? అంత అవసరం ఏమి వచ్చింది అంటూ సమాధానం చెప్పాలని ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మదురై డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.

ఈ దెబ్బతో సెంట్రల్ జైల్లో శశికళను కలిసిన మంత్రులు హడలిపోయారు. ఇప్పుడు న్యాయస్థానంలో ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో ? అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్న మంత్రులు పదేపదే శశికళను కలిసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+