జయలలిత కొడుకు కృష్ణమూర్తి అరెస్టు, తప్పుడు సమాచారమే కారణం?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన జె.కృష్ణమూర్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడుకునంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన జె.కృష్ణమూర్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత జె.కృష్ణమూర్తి అనే వ్యక్తి జయలలిత కొడుకును తానే అంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె వారసుడిగా తనను ప్రకటించాలంటూ కోర్టును కోరారు.
అయితే కృష్ణమూర్తి సమర్పించిన ఆధారాల పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంట్లు ఫోర్జరీవేనని అనుమానించింది.
డాక్యుమెంట్లను శాస్త్రీయంగా అసలువో, నకిలీవో తేల్చాలంటూ పోలీసులను ఆశ్రయించింది.ఈ మేరకు పోలీసులు ఈ డాక్యుమెంట్లు నకలీవని తేల్చారు. దీంతో కోర్టు కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని ఆదేశించింది. అయితే ఆనాటి నుండి కృష్ణమూర్తి పరారీలో ఉన్నాడు.

జయలలిత కొడుకు అరెస్టు
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కొడుకుగా చెప్పుకొన్న కృష్ణమూర్తిని ఎట్టకేలకు చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత , సినీ నటుడు శోభన్ బాబు దంపతులకు తానుపుట్టానని చెప్పుకొన్నాడు. ఈ మేరకు తనను దత్తత తీసుకొన్న విషయాన్ని కూడ కృష్ణమూర్తి కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించాడు.నకిలీ సర్టిఫికెట్లతో కోర్టును తప్పుదోవ పట్టించినందుకు ఆయనను అరెస్టు చేశారు.దిండిగల్ బస్ స్టేషన్ లో కృష్ణమూర్తిని శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు.

లాయర్ల ఇళ్ళలో తలదాచుకొన్న కృష్ణమూర్తి
కృష్ణమూర్తి ఇద్దరు లాయర్ల ఇళ్ళలో తలదాచుకొన్నాడు. కోర్టు అరెస్టు చేయాలని ఆదేశించిన తర్వాత ఆయనను ఈ ఇద్దరు లాయర్ల ఇళ్లలో ఉన్నాడు. అయితే పోలీసులు వేట సాగిస్తున్నారని తెలిసి ఆర్ టి సి బస్సులలో ఒక ప్రాంతం నుండి మరోప్రాంతానికి తిరిగేవాడు.

శశికళ నుండి ప్రాణహని ఉందంటూ ఆరోపణలు
తనకు అన్నాడిఎంకె ప్రదాన కార్యదర్శి శశికళ నుండి ప్రాణహని ఉందంటూ కృష్ణమూర్తి పోలీసులకు చెప్పారు.అందుకే తనకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే తప్పుడు పత్రాలతో కోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది.

ఆస్తుల కోసమేనా?
జయలలిత చనిపోయిన తర్వాత ఆమె వారసుల విషయమై చర్చ జరిగింది. ఈ విషయమై చర్చ జరుగుతున్న తరుణంలోనే కృష్ణమూర్తి తానే వారసుడినంటూ రావడం సంచలనంగా మారింది.అయితే కృష్ణమూర్తి వ్యవహరాన్ని కోర్టు ఆదిలోనే అనుమానించింది. కోర్టు అనుమానించినట్టుగానే ఆయన చెప్పేవన్నీ అబద్దాలన్నీ తేలాయి. చివరకు జైలు ఊచలను కృష్ణమూర్తి లెక్కించాల్సి వచ్చింది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications