Car bomb: ఎక్కడో డొంక కెలికితే ఎక్కడో బయటకు వస్తోంది, దేవాలయాలు టార్గెట్ ?
చెన్నై/కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన కారు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులు షేక్ హిదాయతుల్లా, సనోఫర్ అలీ. కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.
నిందితులు గత ఫిబ్రవరి 2022లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని సత్యమంగళం అటవీ ప్రాంతంలోని అసనూర్ మరియు కడంబూర్ అటవీ ప్రాంతంలో బాంబు పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. గతంలో నిందితుడు ఉమర్ ఫరూక్ నేతృత్వంలో ఈ సమావేశంలో నిందితులు జమేషా ముబీన్, మహ్మద్ అజారుద్దీన్, షేక్ హిదాయతుల్లా, సనోఫర్ అలీ పాల్గొన్నారు. అక్కడే బాంబు పేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు స్కెచ్ వేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఫోరెన్సిక్ విభాగం ద్వారా ఆకారులో మేకులు, గోళీలు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్నాం. అతని ఇంట్లో సోదాలు చేసిన తరువాత, మేము కొన్నిపేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు. పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ - ఇవి కంట్రీ బాంబులను తయారు చేయడానికి ఉపయోగించబడ్డాయి అని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు మీడియాకు చెప్పారు.
పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత ముబిన్ నివాసం వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీ వైరల్‌గా మారింది. పేలుడు జరిగిన రోజు నలుగురు వ్యక్తులు గోనె సంచిలో బరువైన వస్తువును మోసుకుంటూ అతని ఇంటిలోకి వెళ్లిన విషయం స్పష్టంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి నిందితుడు ముబీన్, ఐసిస్‌కు పని చేస్తున్నాడని, సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో ఆత్మాహుతి దాడి చేసి హిందూ ఆలయాన్ని దెబ్బతీయాలని ప్లాన్ చేశాడని అధికారుల విచారలో వెలుగు చూసింది. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications