24లక్షల విలువైన పైరసీ సీడీలను రోడ్డురోలర్‌తో తొక్కించేశారు
చెన్నై: తమిళనాడు పోలీసులు కొత్త సినిమాల పైరసీపై ఉక్కుపాదం మోపుతున్నారు. పలువురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న 80వేల వీసీడీలు, డీవీడీలను ధ్వంసం చేశారు.
స్వాధీనం చేసుకున్న డిస్కులను ఓ రోడ్డుపై వేసి, రోడ్డురోలర్‌తో తొక్కించారు. ఆ సీడీల విలువ రూ. 24లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సీడీలతోపాటు 34 డీవీడీ రైటింగ్ మెషీన్లు కూడా రోడ్డురోలర్‌తో తొక్కించేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి పోలీసులు ఉన్నతాధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. పాత కమిషన్ కార్యాలయం వద్ద ఈ సీడీలను ధ్వంసం చేశారు. రోడ్డు రోలర్ నిమిషాల వ్యవధిలో పని పూర్తి చేయగా, చెన్నై కార్పొరేషన్ సిబ్బంది తుక్కుమారిన సీడీలను, రైటింగ్ మెషీన్లను అక్కడి నుంచి ఎత్తివేశారు.

కొబ్బరికాయలు దొంగిలించాడని చంపేశారు
గాంధీనగర్: కొబ్బరికాయలు దొంగిలించాడని ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక భేలి గ్రామానికి చెందిన రమేశ్(24) అదే గ్రామానికి చెందిన పటేల్ పొలంలోని కొబ్బరికాయలు కోస్తుండగా పటేల్, తన అనుచరుడితో కలిసి వెళ్లి పట్టుకున్నాడు.
అనంతరం రమేశ్‌ని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పటేల్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పటేల్‌ని, అతని అనుచరుడినీ పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications