పోలీసులకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అక్కడ కాదన్నుందుకే !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంలో అనుమానాలు ఉన్నాయని, సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పన్నీర్ సెల్వం చేపట్టిన ఒక్క రోజు ఉపవాస సత్యాగ్రహ దీక్షకు అనుకోని రీతిలో స్పందన వచ్చింది.

పెద్ద ఎత్తున్న పన్నీర్ సెల్వం వర్గీయులతో పాటు అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీలోని చీలిక వర్గం నాయకులు పన్నీర్ సెల్వం దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చెన్నైలోని చేపాక్కం వద్ద దీక్ష చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని పన్నీర్ సెల్వం వర్గం పోలీసు అధికారులకు మనవి చేశారు.

Chennai Police permitted O Panneerselvam to start fasting by 10 am but he started 9am

తమిళనాడు డీజీపీ కార్యాలయం చెపాక్కంలో దీక్ష చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదు. ఎగ్మూరులోని రాజరత్నం స్టేడియం దగ్గర బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పన్నీర్ సెల్వం దీక్ష చెయ్యడానికి పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోలీసులకే ఝలక్ ఇచ్చారు. అనుమతి ఇచ్చిన గంటకు ముందే (ఉదయం 9 గంటలకు) రాజరత్నం స్నేడియం దగ్గరకు చేరుకుని ఉపవాస సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అయితే అనుమతి ఇచ్చిన గంటకు ముందే పన్నీర్ సెల్వం దీక్షకు దిగడంతో పోలీసులు సైతం అడ్డుచెప్పలేక చేతులు ఎత్తేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+