చెన్నై రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని నరికి చంపింది ఇతడే (ఫోటో)
చెన్నై: నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని నరికి చంపిన నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం రిలీజ్ చేశారు. రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన అతడి ఊహా చిత్రం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చెన్నై రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ మహిళా ఉద్యోగిని దారుణ హత్య
నిందితుడుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చెన్నైలోని లోకల్ రైల్వే స్టేషన్లలో ఇటీవల శాంతిభద్రతలు లోపించినట్లు స్థానిక ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు.

హతురాలు చూలైమేడు ప్రాంతానికి చెందిన స్వాతి(25)గా పోలీసులు గుర్తించారు. ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న స్వాతి సూలైమేడు ప్రాంతంలోని దక్షిణ గంగై వీధిలో నివసించేది. ప్పటిలాగే శుక్రవారం ఉదయం 6.20 ప్రాంతంలో ఆమె తండ్రి నుంగంబాకమ్ స్టేషన్ వద్ద దించి వెళ్లాడు. దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు నుంగంబాకమ్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురుచూస్తోంది.
ఇంతలో నల్ల ప్యాంటు వేసుకున్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, ఓ కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. అయితే ముందు ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుందని, ఆ తర్వాత అతడు బ్యాగ్‌లోంచి కత్తిని బయటకు తీసి దాంతో ఆమెను పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్వాతికి తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గత వారం ఆమెకు ఓ క్యాబ్ డ్రైవర్ తో గొడవ అవ్వడంతో, అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. ప్రేమ వ్యవహారమేమన్నా ఈ హత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు స్వాతి తల్లిదండ్రులు, బంధువులను విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications