ఏమైనా జరగొచ్చు: హై అలర్ట్, అమ్మకు ఏమీ కాదు ?
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు స్వయంగా అంగీకరించండంతో ఇంత కాలం ఓపికగా ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడులో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవ్వరూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తమపని తాము చేసుకుని వెలుతామని పోలీసులు అధికారులు హెచ్చరించారు.
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థతి విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు స్వయంగా అంగీకరించండంతో ఇంత కాలం ఓపికగా ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జయలలిత ఆరోగ్యం అంతా ఓకే అంటూ చెబుతూ వచ్చి చివరికి అమ్మను రక్షించడానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని అపోలో ఆసుపత్రి వైద్యులు ఎలా చెబుతారు ? అంటూ అమ్మ అభిమానులు మండిపడుతున్నారు. సోమవారం మద్యాహ్నం అపోలో ఆసుపత్రి వైద్యులు జయలలిత ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసిన తరువాత తమిళనాడులో పరిస్థితులు ఒక్క సారిగామారిపోయాయి.
అపోలో ఆసుపత్రి నుంచి ప్రకటన విడుదల అయిన తరువాత చెన్నైతో పాటు తమిళనాడులో పరిస్థితి అదుపుతప్పింది. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో ? అపశకునం మాటలు వినకుండా నువ్వే కాపాడు దేవుడా అంటూ అమ్మ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

అన్నాడీఎంకే నాయకులు ఒక్కసారిగా మోనంగా ఉండిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు. సోమవారం మద్యాహ్నం నుంచి అపోలో ఆసుపత్రి వైపు వచ్చే అభిమానులను పోలీసులు కట్టడి చెయ్యలేకపోతున్నారు.
వేలాధి మంది పోలీసులు అపోలో ఆసుపత్రి దగ్గర భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. అయితే ఒక్క సారిగా అమ్మ అభిమానులు అపోలో ఆసుపత్రి వైపు పరుగు తీయ్యడంతో పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్ల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు.












Click it and Unblock the Notifications