15వ అంతస్థు నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన పాతికేళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీపికా సింగపూర్‌లో ఆత్మహత్య చేసుకుంది. సింగపూర్‌లోని ఓ భవనంలో 15వ అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణం తీసుకుంది. తమ అల్లుడి వేధింపులు వల్లనే తమ కుమార్తె చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సింగపూర్ లో పని చేస్తున్న జైకిషన్ అనే వ్యక్తిని దీపిక పెళ్లాడింది. సెప్టెంబరు 2న వీరికి ఓ పాప కూడా పుట్టింది. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలైనట్లు ఆరోపిస్తున్నారు. దీపిక బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తన సోదరికి ఓ ఎస్ఎంఎస్ పంపింది.
తనకు ఏమైనా జరిగితే తన మృతదేహాన్ని సింగపూర్ నుంచి తమిళనాడుకు తరలించేందుకు తన భర్త వద్ద నుంచి కావలసిన డబ్బు తీసుకోవాలని రాసింది. దీంతో బెంబేలెత్తి పోలీసులకు సమాచారాన్ని అందించేలోపే ఆమె ఆత్మహత్య చేసుకుందిది.

ఆడపిల్ల పుట్టాక తమ కూతురును వదిలించుకునేందుకు అల్లుడు జైక్రిష్ణన్, అతడి తల్లిదండ్రులు తమ కుమార్తె కళ్లజోడు ధరిస్తుందనీ, అందువల్ల విడాకులు కావాలని కోరినట్లు దీపిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి ముందే ఆమెకు కంటి ఆపరేషన్ చేయించామనీ, ఇదంతా ముందే వారికి తెలుసని అంటున్నారు.
తమ బిడ్డ గర్భవతి అయినప్పుడు ఆమెను ఇండియాకు పంపాలని అడిగితే సింగపూర్ సిటిజన్ షిప్ కావాలంటే ఆమె ఇక్కడే పుట్టాలని చెప్పిన తమ అల్లుడు ఆ తర్వాత తమను రూ. 10 లక్షలు డిమాండ్ చేశారని దీపిక తల్లిదండ్రులు చెపుతున్నారు. దీపికా భర్త క్రిష్ణన్ ను ఇండియాకు రప్పించి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వారు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications