చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ ఆదేశం:హై అలర్ట్, ఆంధ్రా బార్డర్ క్లోజ్, తమిళనాడులో ఏం జరుగుతోంది!

తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ కే చేరుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని తమిళ ప్రజలు హడలిపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్ కే చేరుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని తమిళ ప్రజలు హడలిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

చెన్నై నగరంతో పాటు తమిళనాడులో ఎలాంటి ఆందోళనలు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.తమిళ పీఠం కోసం వారం రోజులుగా కొనసాగుతున్న హై డ్రామా ఎట్టకేలకు క్లైమాక్స్ కు చేరుకుంది.

ఈ సమయంలో అల్లరిమూకలు గొడవలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. చెన్నై నగరంతో సహ తమిళనాడులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మన్నార్ గుడి మాఫియా: శశికళ అండ్ కో కేసుల చిట్టా, సీఎంగా నో చాన్స్?మన్నార్ గుడి మాఫియా: శశికళ అండ్ కో కేసుల చిట్టా, సీఎంగా నో చాన్స్?

ఇతర ప్రాంతాల నుంచి అల్లరిమూకలు తమిళనాడులోచొరబడకుండా పోలీసులు గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు.
చెన్నై నగరంలో 20 వేల మంది పోలీసులు, తమిళనాడులోని సున్నితమైన ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

Chennai tops the list of most number of men arrested across the state with a total of 500 arrests,

అయితే శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు ఉన్న గోల్డన్ బే రిసార్ట్ దగ్గర 700 మంది పోలీసులు ఎమ్మెల్యేల క్యాంపు చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి బయటి వ్యక్తలు చెన్నై నగరంలో అడుగు పెట్టకుండా తమిళనాడు పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు ? అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో మరింత గందరగోళం నెలకొంది. అయితే మంగళవారం సాయంత్రానికి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చెయ్యాలి అంటూ తన నిర్ణయాన్ని వెలువరిస్తారని సమాచారం.

జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్

అయితే ఇప్పుడు అన్నాడీఎంకే శాసన సభ్యులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటి వరకు శశికళ శిభిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆమె దోషిగా మారితే ఏమవుతుంది ? నిర్దోషిగా ప్రకటిస్తే ఏమవుతుంది ? అనే విషయంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అయితే శశికళ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు ? తీర్పు తారుమారు అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు గోడదూకి పన్నీర్ సెల్వం గూటికి చేరిపోతారు ? అనే విషయం అంతు పట్టడం లేదు. ముందు జాగ్రత చర్యగా చెన్నై నగరంతో సహ తమిళనాడులో 500 మందికి పైగా రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై నగరంలోనే 105 మంది పేరుమోసిన రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులు నాకాబంధీ ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

English summary
Chennai tops the list of most number of men arrested across the state with a total of 500 arrests. VK Sasikala Natarajan sleepover at MLa Camp in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X