Chennai: శోభనం రోజు బంగారు నగలు, నగదుతో పెళ్లికూతురు జంప్, జోడీ యాప్ కవిత కహానీ !
చెన్నై/ కన్యాకుమారి/సేలం: పెళ్లి చేసుకున్న లారీ ఓనర్ అతని భార్యతో సంతోషంగా జీవించాడు. లారీ డ్రైవర్ కు ఓ కొడుకు ఉన్నాడు. అనారోగ్యంతో భార్య చనిపోయింది. భార్య చనిపోవడంతో కొడుకును చూసుకోవడానికి మరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. జోడీ యాప్ ద్వారా ఓ మహిళ పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ టచ్ లో ఉన్నారు. మాట్లాడాలని లారీ ఓనర్ ను ఆమె ఊరికి పిలిపించుకుంది. మాట్లాడటానికి వెళ్లిన లారీ ఓనర్ తో కొన్ని గంటలు ఆమె మాట్లాడింది. అదే రోజు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని లారీ ఓనర్ ఇంటికి వెళ్లిన కిలాడీ లేడీ ఆరోజు అక్కడే ఉంది. రాత్రి శోభనం జరిగింది. శోభనం జరిగిన రోజు రాత్రే కొత్త మొగుడి ఇంట్లో బంగారు నగలు, నగదు ఎత్తుకుని కొత్త పెళ్లి కూతురు పరారైయ్యింది. తరువాత జోడీ యాప్ కిలాడీ లేడీ కవిత కహానీ గురించి తెలుసుకున్న ఆమె కొత్త మొగుడు బిత్తరపోయాడు.

భార్య చనిపోయింది
తమిళనాడులోని సేలం జిల్లాలోని ఎడప్పాడి సమీపంలోని సనారపట్టి ప్రాంతంలో సెంథిల్ (48) అనే లారీ ఓనర్ నివాసం ఉంటున్నాడు.
పెళ్లి చేసుకున్న లారీ ఓనర్ సెంథిల్ అతని భార్యతో చాలా సంతోషంగా జీవించాడు. లారీ డ్రైవర్ కు ప్రస్తుతం 12 ఏళ్ల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు. అనారోగ్యంతో సెంథిల్ భార్య చనిపోయింది.

రెండో పెళ్లి చేసుకోవాలని ?
సొంతలారీని నడుపుతున్న సెంథిల్ ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. తన కొడుకును చూసుకోవడానికి అవసరం అని సెంథిల్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సెంథిల్ కు 48 ఏళ్ల వయసు ఉండటంతో అతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. చాలా కాలం నుంచి రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.

జోడీ యాప్ లేడీ ఎంట్రీ
పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సెంథిల్ కు జోడీ యాప్ ద్వారా కన్యాకుమారికి చెందిన లతా అలియాస్ కవిత అనే మహిళ పరిచయం అయ్యింది. తన భర్త చనిపోవడంతో తాను ఒంటరిగా ఉంటున్నానని, రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని కవిత లారీ ఓనర్ సెంథిల్ కు చెప్పింది. కొంతకాలం కవిత, సెంథిల్ ఇద్దరూ టచ్ లో ఉన్నారు.

మాట్లాడాలని పిలిపించి అదే రోజు పెళ్లి
నీతో నేరుగా మాట్లాడాలని, మా ఊరికి రావాలని కవిత లారీ ఓనర్ సెంథిల్ కు చెప్పింది. జూన్ 24వ తేదీన సెంథిల్ జోడీ యాప్ లేడీ కవితను కలవడానికి ఆమె ఊరికి వెళ్లాడు. సెంథిల్ కు మాయమాటలు చెప్పిన కవిత అదే రోజు అతన్ని పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత కవిత ఆమె కొత్త మొగుడు సెంథిల్ ఇంటికి వెళ్లింది.

శోభనం రోజు రాత్రే ఎస్కేప్
పెళ్లి చేసుకుని లారీ ఓనర్ సెంథిల్ ఇంటికి వెళ్లిన కిలాడీ లేడీ కవతి ఆరోజు అక్కడే ఉంది. రాత్రి శోభనం కూడా జరిగిపోయింది. శోభనం రోజే కొత్త మొగుడు సెంథిల్ ఇంట్లో బంగారు నగలు, నగదు ఎత్తుకున్న కొత్త పెళ్లి కూతురు కవిత పరారైయ్యింది. అదే రోజు సెంథిల్ కవితకు ఫోన్ చేశాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఫోన్ వచ్చిందని, ఆందోళనలో మీకు చెప్పలేక వచ్చేశానని సెంథిల్ ను నమ్మించింది.

బిత్తరపోయిన భర్త
తన తల్లి ఆరోగ్యం కుదటపడిన తరువాత ఇంటికి వస్తానని కొన్ని రోజులు కవిత ఆమె భర్త సెంథిల్ ను నమ్మించింది. ఇంతకాలం కవిత ఇదే డైలాగ్ వేస్తూ సెంథిల్ ను నమ్మించింది. సెంథిల్ ఆధార్ కార్డు ఉపయోగించిన కవిత వేరే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్ సెంథిల్ కవితను ప్రశ్నించాడు. అంతే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన కవిత మాయం అయిపోయింది.

కన్నింగ్ లేడీ కవిత కహానీ
మోసపోయానని గుర్తించిన సెంథిల్ కేసు పెట్టాడు. ఎట్టకేలకు కన్యాకుమారి కవిత అలియాస్ లతా పోలీసులకు చిక్కిపోయింది. జోడీ యాప్ కిలాడీ లేడీ కవిత కహానీ గురించి తెలుసుకున్న ఆమె కొత్త మొగుడు బిత్తరపోయాడు. జోడీ యాప్ ద్వారా అనేక మంది అమాయకులను పరిచయం చేసుకుంటున్న కవిత పెళ్లి పేరుతో వారిని నిలువునా ముంచేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications